మా ఎన్నికల పోలింగ్ కేంద్రంలో రౌడీషీటర్ : ప్రకాష్ రాజ్

Webdunia
శుక్రవారం, 22 అక్టోబరు 2021 (14:38 IST)
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)ల పోలింగ్ ఈ నెల 10వ తేదీన జరిగాయి. ఈ ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్ విజయం సాధించింది. అదేసమయంలో ప్రకాష్ రాజ్ ప్యానెల్ తరపున గెలిచిన సభ్యులంతా మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. 
 
ఈ నేపథ్యంలో ఎన్నికల వివాదం కీలక మలుపు తిరిగింది. ఎన్నికల సందర్భంగా వైసీపీకి చెందిన ఒక వ్యక్తి ఎన్నికల హాల్‌లో ఉన్నాడని ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు ప్రకాశ్ రాజ్ ఫిర్యాదు చేశారు. 
 
విష్ణు ప్యానల్ బ్యాడ్జి పెట్టుకుని ఆయన హల్ చల్ చేశారని ఆరోపించారు. ఆ వ్యక్తి పేరు నూకల సాంబశివరావు అని, జగ్గయ్యపేటకు చెందిన వాడని తెలిపారు. జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్‌లో ఆయనపై రౌడీషీట్ కూడా ఉందని చెప్పారు.
 
అంతేకాదు ఏపీ ముఖ్యమంత్రి జగన్, మోహన్ బాబు, విష్ణులతో సాంబశివరావు దిగిన ఫొటోలను, కొన్ని వీడియోలను ఎన్నికల అధికారికి పంపించారు. ఓటర్లను సాంబశివరావు బెదిరించారని... ఆయన బెదిరింపులకు భయపడిన ఓటర్లు విష్ణు ప్యానల్‌కి ఓట్లు వేశారని చెప్పారు. 
 
'మా' సభ్యులు కాని వారిని ఎన్నికల హాల్‌లోకి ఎలా అనుమతించారని ప్రశ్నించారు. క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తిని వెంట పెట్టుకుని విష్ణు ప్యానల్ తిరిగిందని చెప్పారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రకాష్ రాజ్ డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Google‌కి బాబు ఇచ్చిన ప్రోత్సహకాలు చూసి గుడ్లు తేలేస్తున్న కర్నాటక ఐటి మినిస్టర్ (Video)

మంత్రి నారాయణగారు నన్నేమన్నారో చూపించండి: వర్మ సూటి ప్రశ్న (video)

కొండా సురేఖ ఇంట్లో అర్థరాత్రి హైడ్రామా.. మా అమ్మ ఇంటికొచ్చి కన్నీళ్లు పెట్టుకునేది? (video)

ఏపీ అభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కారు : ప్రధాని నరేంద్ర మోడీ

కర్ణాటక మంత్రులు వర్సెస్ నారా లోకేష్‌ల స్పైసీ వార్... రాయితీలిస్తే ఏపీకి పెట్టుబడులు రావా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

తర్వాతి కథనం
Show comments