రౌడీషీట‌ర్ నీడ‌లో మా ఎన్నిక‌లు - ఇదిగో ప్రూఫ్ అంటోన్న ప్ర‌కాష్‌రాజ్‌

Webdunia
శుక్రవారం, 22 అక్టోబరు 2021 (13:51 IST)
Prakash raj - letter
ప్ర‌కాష్‌రాజ్ మ‌రోసారి మా ఎన్నిక‌ల అధికారికి ఓ అస్త్రంను ఎక్కుపెట్టారు. ఇప్ప‌టివ‌ర‌కు ఎన్నిక‌ల తీరు గురించి సీసీ ఫుటేజ్‌ను అడిగామ‌ని తెలియ‌జేస్తూ శుక్ర‌వారంనాడు మ‌రోసారి అడిగారు.  ప్రియమైన ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ గారూ ఇది ప్రారంభం మాత్రమే. మాకు CC ఫుటేజ్ ఇవ్వండి. ఏమి జరిగిందో ప్రపంచానికి తెలియజేస్తాం. ఎన్నికలు ఎలా నిర్వహించబడ్డాయి. .జ‌స్ట్ ఆస్కింగ్ అంటూ ట్విట్ట‌ర్‌లో పేర్కొంటూ మా ఎన్నిక‌ల్ల‌లో ఓ రౌడీ షీట‌ర్ వున్న ఫొటోను కూడా చూపించారు.
 
rowdysheeter with manchu family
జగ్గయ్య పేటకు చెందిన‌ సాంబశివరావు అనే రౌడీ షీటర్‌, మోహ‌న్‌బాబు, మంచు విష్ణుతోపాటు వై.ఎస్‌. జ‌గ‌న్ ప‌క్క‌నే వున్న ఫొటోల‌ను ప్ర‌కాష్‌రాజ్ బ‌య‌ట‌పెట్టాడు. ఇవ‌న్నీ ఎన్నికల అధికారికి తెలియ‌జేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. అంతేకాక  ‘మా’ ఎన్నికల సమయంలో ఏపీ రౌడీ షీటర్లు ఓటర్లను బెదిరించారంటూ ప్రకాష్ రాజ్ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. నూకల సాంబశివరావు అనే రౌడీ షీటర్ మా ఎన్నిక‌ల సంద‌ర్భంగా హ‌డావుడి చేశాడ‌నీ, కృష్ణా జిల్లా లో అత‌నిపై రౌడీ షీట్ ఉందని,  ఓ హ‌త్య‌కేసు కూడా వుంద‌నీ, గతంలో పోలీసుల‌ను కూడా కొట్టినట్లుగా సాక్షాలున్నాయ‌ని లిఖిత‌పూర్వ‌కంగా  ప్రకాష్ రాజ్  పేర్కొన్నారు. మ‌రి దీనిపై ఎన్నిక‌ల అధికారి ఏ స‌మాధానం చెబుతాడో చూడాలి. 
 
ట్విస్ట్ ఏమంటే ఈరోజు సాయంత్రానికి మంచు విష్ణు మా స‌భ్యులంద‌రికీ గుడ్ న్యూస్ తెలియ‌జేస్తామంటూ షేర్ చేశాడు. ఆ వివ‌రాలు ఏమిట‌నేవి కొద్ది గంట‌ల్లో తెలియ‌నున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డయల్ బిఫోర్ యు డిగ్ అని కోరుతున్న థింక్ గ్యాస్

ఒక్క రాత్రికి రూ. 10 వేలు ఇస్తా, నాతో పడుకుంటావా?: కామాంధుడికి దేహశుద్ధి (video)

IIT Bombay: హాస్టల్ బాత్రూమ్‌లో కెమెరాలు ఫిక్స్ చేసి చిక్కిన ఓల్డ్ స్టూడెంట్.. చివరికి?

కోడలు గర్భిణి.. అయినా చంపేశాడు... గొడ్డలి, కత్తితో దాడి చేసి..?

Nara Lokesh: ఆస్ట్రేలియాకు నారా లోకేష్.. దీపావళి బహుమతిని అలా తెస్తారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments