Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా కాపురంలో చిచ్చుపెట్టింది.. ఆ హీరోయిన్‌ను దేవుడు శిక్షిస్తాడు... (video)

Webdunia
గురువారం, 16 ఏప్రియల్ 2020 (11:55 IST)
సినీ నృత్యదర్శకుడు, దర్శకుడు కమ్ హీరో అయిన ప్రభుదేవా - హీరోయిన్ నయనతారల ప్రేమాయణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ హీరోయిన్ ప్రేమ కోసం ప్రభుదేవా ఇద్దరు పిల్లల తల్లికి విడాకులు కూడా ఇచ్చారు. ఆమె పేరు రమాలత్. ఓ ముస్లిం యువతి. తాను ఎంతగానే ఇష్టపడి, ప్రేమించి 1995లో పెళ్లి చేసుకున్నాడు. పైగా, ప్రభుదేవా కోసం రమాలత్ తన మతాన్ని కూడా మార్చుకుంది. అలా 15 యేళ్లుగా సాఫీగా సాగిపోతూ వచ్చిన వారి కుటుంబంలో కలహాలు చెలరేగాయి. దానికి కారణం హీరోయిన్ నయనతార. ప్రభుదేవాకు నయనతారపై ప్రేమ కలగడం, వారిద్దరూ గాఢమైన ప్రేమికులుగా మారిపోవడం జరిగింది. 
 
దీంతో ప్రభుదేవా తన తొలి భార్య రమాలత్‌కు 2011లో విడాకులు ఇచ్చాడు. అప్పటికే రమాలత్‌కు - ప్రభుదేవాల దాంపత్య జీవితానికి గుర్తుగా లభించిన కుమారుడు కేన్సర్ వ్యాధితో 2008లో చనిపోయాడు. కన్నబిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న రమాలత్‌కు ప్రభుదేవా విడాకులు ఇవ్వడాన్ని ఆమె జీర్ణించుకోలేక పోయింది. ఇవేమీ పట్టించుకోని ప్రభుదేవా.. నయనతార మాయలో పడిపోయి.. మొదటి భార్యకు విడాకులు ఇచ్చేశాడు. ఆ తర్వాత నయనతారతో కూడా సంబంధాలు చెడిపోయి, ఇపుడు ఒంటరివాడిగా ఉన్నాడు. 
 
దీనిపై రమాలత్ స్పందిస్తూ, తమ సంసారంలో చిచ్చుకు నయనతారే కారణమని ఆరోపించింది. న‌య‌న‌తార వ‌ల‌న త‌న బతుకు రోడ్డున ప‌డ‌డాన్ని ర‌మాల‌త్ అస్స‌లు జీర్ణించుకోలేక‌పోతుంది. న‌య‌న‌తార‌ని దేవుడు త‌ప్పక శిక్షిస్తాడ‌ని అంటుంది. నేనంటే ప్రాణమిచ్చే భర్తను నాకు కాకుండా చేసిన నయనతార అంతకంత తన జీవితంలో అనుభవిస్తుందని శాపనార్థాలు పెడుతుంది రమాలత్. 
 
15 ఏళ్ళ పాటు న‌న్ను కంటికి రెప్ప‌లా చూసుకున్న నా భ‌ర్త న‌య‌న‌తార వ‌చ్చాక ప‌ట్టించుకోవ‌డ‌మే మానేశాడు. నా భ‌ర్త‌ని ఆమె ఏం మాయ చేసిందో అంటూ ర‌మాలత్ చిర్రుబుర్రులాడుతుంది. ఇన్నేళ్ళ త‌ర్వాత ర‌మాల‌త్ చేసిన‌ వ్యాఖ్య‌ల‌తో న‌య‌న‌తార‌ ప్రేమాయ‌ణం హాట్ టాపిక్‌గా మారింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ కేసు: జగన్‌ను అదానీ ఎప్పుడెప్పుడు కలిశారు.. అమెరికా అభియోగాల్లో ఏముంది?

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments