Webdunia - Bharat's app for daily news and videos

Install App

విష్ణు మంచు, పాయల్ రాజ్ ఫుత్ పాటకు ప్రభుదేవా కొరియోగ్రఫీ!

Webdunia
బుధవారం, 4 మే 2022 (16:59 IST)
Vishnu, Prabhu Deva
డా. మంచు మోహన్ బాబు ఆశీస్సులతో అవ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో విష్ణు మంచు హీరోగా ఈషాన్ సూర్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమాకి సంబంధించి ఓ పాట చిత్రీకరణ జరుగుతోంది. ఈ పాటకు ఓ స్పెషాల్టీ ఉంది. అదేంటంటే...
 
చాలా గ్యాప్ తర్వాత తెలుగు సినిమా కోసం ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా కొరియోగ్రఫీ అందిస్తున్నారు. విష్ణు మంచు, పాయల్ రాజ్ ఫుత్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న పాటకు ప్రభుదేవా కొరియోగ్రఫీ అందిస్తుండటం విశేషం. ఈ పాట సినిమాకి హైలైట్ అవుతుందనే నమ్మకంతో ఉంది చిత్రం యూనిట్.
 
ఇప్పటికే ఈ సినిమాలో విష్ణు  మంచు  నటిస్తున్న 'గాలి నాగేశ్వరరావు' క్యారెక్టర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంటర్నేషనల్ సెన్సేషన్ సన్నీలియోన్ రేణుకగా, పాయల్ పాజ్ ఫుత్ స్వాతిగా కీలక పాత్రలు చేస్తున్నారు.
 
ఈ సినిమాకి కథ, స్ర్కీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు కోన వెంకట్. డాషింగ్ సినిమాటోగ్రాఫర్ చో టా.కె.నాయుడు కెమెరామ్యాన్ గా భాను, నందు డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చుతున్నారు. జి.నాగేశ్వరరెడ్డి మూల కథ అందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

NISAR: NASA-ISRO మొట్టమొదటి రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహ ప్రయోగం (video)

Lord Buddha: 127 ఏళ్ల తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన బుద్ధుని పవిత్ర అవశేషాలు

అభ్యంతరకర వీడియోలు - 43 ఓటీటీలను నిషేధించిన కేంద్రం

ఆగస్టు ఒకటో తేదీ నుంచి నో హెల్మెట్ - నో పెట్రోల్

Bengaluru: విద్యార్థులకు మెట్రో పాస్‌లు, ఫీడర్ బస్సులు ఇవ్వాలి.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments