Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణ వ్రింద విహారి నుంచి సెకెండ్ సాంగ్ ఏముంది రా.. విడుదల

Webdunia
బుధవారం, 4 మే 2022 (16:48 IST)
Naga Shourya, Shirley Setia
హీరో నాగశౌర్య కథానాయకుడిగా అనీష్‌ ఆర్‌ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మిస్తున్న చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి'. ఇప్పటికే టీజర్, ఫస్ట్ సింగల్ తో ప్రేక్షకుల్లో అంచనాలు పెంచిన ఈ చిత్రం సమ్మర్ రేసులో మే20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
 
మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ సింగల్ 'వర్షంలో వెన్నెల' మెలోడి హిట్ గా నిలిచింది. మహతి స్వర సాగర్  కంపోజ్ చేసిన మెలోడి మళ్ళీమళ్ళీ పాడుకునేలా వుండటంతో పాటు నాగశౌర్య, షిర్లీ సెటియాల కెమిస్ట్రీ చూడముచ్చటగా అలరించింది.
 
ఈ చిత్రం నుంచి రెండో పాట ''ఏముంది రా'' లిరికల్ వీడియోని చిత్ర యూనిట్ ఈ రోజు విడుదల చేసింది. గాయకుడు హరిచరణ్ పాడిన ఈ పాటని ఇన్ స్టంట్ గా హిట్ అయ్యేలా  కంపోజ్ చేశారు మహతి స్వర సాగర్. ప్లజంట్ ఇన్‌స్ట్రుమెంటేషన్‌తో వినడానికి హాయిగా అనిపిస్తున్న ఈ పాటకి అంతే చక్కని సాహిత్యం అందించారు హర్ష.
 
లిరికల్ వీడియోలో చూపించిన విజివల్స్ కూడా బ్యూటీఫుల్‌గా వున్నాయి. పాటలో నాగశౌర్య, షిర్లీని ఆగ్రహారానికి తీసుకురావడం, ఆమె సాంప్రదాయ బ్రాహ్మణ అమ్మాయిగా కనిపించడం, హల్దీ ఫంక్షన్ మొదలుకొని పెళ్లి, సీమంతం, పిల్లలు..ఇలా హ్యాపీ మూమెంట్స్ ని పాటలో చూపించారు.
 
డిఫరెంట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మిస్తుండగా, శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ రాధిక ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఈ చిత్రానికి సాయిశ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా, తమ్మిరాజు ఎడిటర్ గా పనిచేస్తున్నారు.
 
తారాగణం: నాగ శౌర్య, షిర్లీ సెటియా, రాధిక, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరులు
సాంకేతిక విభాగం: దర్శకత్వం:  అనీష్ ఆర్. కృష్ణ, నిర్మాత: ఉషా ముల్పూరి, సమర్పణ: శంకర్ ప్రసాద్ ముల్పూరి, సంగీతం: మహతి స్వరసాగర్, డివోపీ: సాయిశ్రీరామ్, సహ నిర్మాత: బుజ్జి, ఎడిటర్ - తమ్మిరాజు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గోవా బీచ్‌లో ఇడ్లీ, సాంబార్ అమ్మితే పర్యాటకులు ఎలా వస్తారు? లోబో కామెంట్స్ వైరల్

ఆ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ... పెద్ద కుమార్తె గర్భందాల్చింది.. ఎలా?

Uttarakhand: ఉత్తరాఖండ్‌లో హిమపాతం బీభత్సం-చిక్కుకున్న 57మంది.. 15మంది సేఫ్

ఆస్తిపన్ను చెల్లించని వారిపై కొరఢా - రూ.200 ఆస్తులను సీజ్ చేసిన జీహెచ్ఎంసీ

AP Agriculture Budget 2025-26 : వ్యవసాయ రంగం 22.86శాతం వృద్ధి.. హైలైట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

వేపతో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments