Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ పెళ్లి.. ఎప్పుడు, ఎవరితో జరుగుతుందో తెలియదట-అనుష్కను ''అమ్మ'' అని పిలవడానికి?

బాహుబలి హీరో.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా ముద్ర వేసుకున్న యంగ్ రెబల్ స్టార్ పెళ్లి ఎప్పుడు జరుగుతుందా అని ఫ్యాన్స్ ఆత్రుతతో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి సినిమా పూర్తయ్యాక ప్రభాస

Webdunia
సోమవారం, 17 ఏప్రియల్ 2017 (11:57 IST)
బాహుబలి హీరో.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా ముద్ర వేసుకున్న యంగ్ రెబల్ స్టార్ పెళ్లి ఎప్పుడు జరుగుతుందా అని ఫ్యాన్స్ ఆత్రుతతో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి సినిమా పూర్తయ్యాక ప్రభాస్ పెళ్లి చేసుకుంటారని అనుకున్నా.. ప్రభాస్ మాత్రం పెళ్లిపై రోజుకో మాట మాట్లాడుతున్నాడు. 
 
‘బాహుబలి 2’ పూర్తయ్యేంత వరకు పెళ్లి చేసుకోకూడదన్న నిర్ణయం తీసుకున్నట్లు జరుగుతున్న ప్రచారం అబద్ధమని ఇటీవల చెప్పిన ప్రభాస్.. ఈ విషయంలో తనది స్వీటీ అనుష్కది ఒక్కటే సమాధానమన్నారు. పెళ్లి ప్రస్తావన వచ్చినపుడల్లా స్వీటీ ఎలాంటి సమాధానం ఇచ్చిందో... తనది కూడా అదే ఆన్సర్ అని ప్రభాస్ చెప్పుకొచ్చారు
 
ఇక తాజాగా పెళ్లిపై నోరు విప్పిన ప్రభాస్ తనది లవ్ మ్యారేజా పెద్దల కుదిర్చే పెళ్ళా అనేది చెప్పకపోయినా.. 'తన పెళ్లి ఎప్పుడు జరుగుతుందో, ఎవరితో జరుగుతుందో తనకే తెలియదని' అభిప్రాయపడ్డారు. అంటే ఇంకోసారి తనను ఈ విషయం అడగవద్దు అన్నట్లుగా మీడియా వర్గాలకు పరోక్ష సూచనలు ఇచ్చారు ప్రభాస్.
 
ఇక, ఈ నెల 28న విడుదల కాబోతున్న 'బాహుబలి 2' సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఇంటర్వ్యూలు ఇస్తున్న ప్రభాస్, అందులో భాగంగానే ఈ పెళ్లి కబురు తెలిపారు. సినిమా విషయానికి వస్తే, ఈ సినిమాలో తన క్యారెక్టర్ 'బాహుబలి' కాకుండా తనకు రమ్యకృష్ణ పోషించిన 'శివగామి' పాత్ర అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు. అంతేగాకుండా బిల్లా, మిర్చి వంటి సినిమాల్లో లవర్‌గా చూసిన అనుష్కను బాహుబలిలో అమ్మగా పిలిచేందుకు చాలా ఇబ్బంది పడ్డానని చెప్పాడు. అమరేంద్ర బాహుబలిగా అనుష్కతో రొమాన్స్ చేయడం ఓకే గానీ, శివుడిగా అనుష్కను అమ్మ అని పిలవడం కాస్త ఇబ్బందిగానే ఫీలయ్యానని ప్రభాస్ అన్నాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

రన్ వేపై విమానం ల్యాండ్ అవుతుండగా అడ్డుగా మూడు జింకలు (video)

Rickshaw: 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన రిక్షావాడు అరెస్ట్

వైజాగ్, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తి చేస్తాం.. నారాయణ

పరీక్ష రాసేందుకు వెళ్తే స్పృహ కోల్పోయింది.. కదులుతున్న ఆంబులెన్స్‌లోనే అత్యాచారం

నా మేనేజర్‌తో నా భార్య మాట్లాడింది కూడా రేవంత్ రెడ్డి ట్యాప్ చేసిండు: కౌశిక్ రెడ్డి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments