Webdunia - Bharat's app for daily news and videos

Install App

పింక్ బికినీ - హాట్ ఫిజిక్‌తో ఐపీఎల్‌లో దర్శనమిచ్చిన హీరోయిన్?

తొలిచూపులోనే అందరి దృష్టినీ ఆకర్షించిన తార స్నేహా ఉల్లాల్. తొమ్మిదేళ్ల క్రితం ‘లక్కీ’ సినిమాతో తెరంగేట్రం చేశారామె. ఆ సినిమా సమయంలో అందరూ ఆమెను నిజంగా లక్కీ అన్నారు. బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్ పోల

Webdunia
సోమవారం, 17 ఏప్రియల్ 2017 (11:43 IST)
తొలిచూపులోనే అందరి దృష్టినీ ఆకర్షించిన తార స్నేహా ఉల్లాల్. తొమ్మిదేళ్ల క్రితం ‘లక్కీ’ సినిమాతో తెరంగేట్రం చేశారామె. ఆ సినిమా సమయంలో అందరూ ఆమెను నిజంగా లక్కీ అన్నారు. బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్ పోలికలుండటం ఓ లక్. సల్మాన్‌ఖాన్ వంటి సూపర్‌స్టార్ గాడ్‌ఫాదర్ అవ్వడం మరో లక్. తొలి సినిమాకే ఎక్కడలేని ప్రచారం లభించడం ఇంకో లక్. ఇలా స్నేహకు అన్నీ లక్కులే అన్నారంతా. తీరా సినిమా విడుదలయ్యాక ఆమెకు లక్ అంతగా కలిసి రాలేదు. ఇక చేసేది లేక దక్షిణాది బాట పట్టారామె. ఇక్కడ కూడా అర కొర విజయాలే దక్కడంతో మళ్లీ ముంబై చేరుకున్నారామె. 
 
గత కొంతకాలంగా సరైన్ హిట్స్ లేక సైలెంట్ అయిపోయారు. ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్‌లో అడపాదడపా సినిమాలు చేస్తున్నా సరైన బ్రేక్ రాలేదు. జూనియర్ ఐష్‌గా పేరు సంపాదించుకున్నా ఫలితం లేకపోయింది. లోపాలను సరిదిద్దుకున్న ఈ బ్యూటీ, రకరకాల డ్యాన్స్‌లు కూడా నేర్చుకుంది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌ అయ్యింది. ప్రస్తుతం ఐపీఎల్‌ 2017లో తెగ హంగామా చేస్తోంది.
 
ఐపీఎల్ పోటీలు ప్రసారమయ్యే టీవీ చానెల్స్‌లో ఎక్కడ చూసినా ఈమె కనిపిస్తోంది. తాజాగా పింక్ బికినీలో అదరగొట్టేసింది. క్యూట్ లుక్స్‌తో, హాట్ ఫిజిక్‌తో దర్శనమిచ్చింది. అసలే వేసవి, సమ్మర్‌లో ఇలా సేద తీరుతున్నట్లుగా కనిపించింది. బికినీకి దెబ్బకి ఉల్లాల్ బిజీ అవుతుందో లేదో చూడాలి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పూజగదిలో రేవంత్ రెడ్డి ఫోటో.. పూజలు చేస్తోన్న కుమారీ ఆంటీ - video viral

అక్రమ వలసదారులకు సంకెళ్లు.. వీడియో వైరల్.. హా హా వావ్ అంటోన్న ఎలెన్ మస్క్ (Video)

Kushaiguda: తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మంటలు.. ఎవరికి ఏమైంది?

Chandrababu Naidu: హస్తినకు బయల్దేరనున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్.. ఎందుకో తెలుసా?

మిర్చి యార్డ్‌లోకి ప్రవేశిస్తే అరెస్టు చేస్తాం.. జగన్‌కు అనుమతులు నిరాకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments