Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచు విష్ణు కలల ప్రాజెక్టు "కన్నప్ప"లో ప్రభాస్?

Webdunia
ఆదివారం, 10 సెప్టెంబరు 2023 (13:41 IST)
హీరో మంచు విష్ణు కలల ప్రాజెక్టుగా భావిస్తున్న కన్నప్ప చిత్రంలో టాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్ హీరో ప్రభాస్‌ నటించనున్నట్టు ఓ వార్త హల్చల్ చేస్తుంది. భక్త కన్నప్ప కథతో రూపొందుతున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైంది. 
 
ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ప్రముఖ నటుడు ప్రభాస్‌ ఈ చిత్రంలో అతిథి పాత్ర పోషించనున్నారని తెలుస్తోంది. ఆయన పాత్ర ఎంతో కీలకంగా ఉండనుందని వార్తలు వస్తున్నాయి. నెట్టింట వైరల్‌గా మారిన ఈ విషయంపై మంచు విష్ణు తాజాగా స్పందించారు. 
 
'హర హర మహాదేవ్‌' అని ట్వీట్‌ చేశారు. దీనిని చూసిన అభిమానులు.. 'కన్నప్ప' చిత్రంలో ప్రభాస్‌ శివుడిగా కనిపించనున్నారని భావిస్తున్నారు. ఒకవేళ ఇదే కనుక నిజమైతే.. ప్రభాస్‌ని మూడోసారి దేవుడి పాత్రలో చూసే అవకాశం అభిమానులకు దక్కుతుంది. ఆయన ఇప్పటికే 'ఆదిపురుష్‌'లో రాముడిగా కనిపించారు. 'కల్కి'లో విష్ణు మూర్తిగా కనిపించనున్నట్లు సమాచారం.
 
విష్ణు ఎన్నో ఏళ్ల నుంచి 'కన్నప్ప' చిత్రాన్ని తెరకెక్కించాలని ఆశించారు. ఆగస్టులో దీనిని పట్టాలెక్కించారు. నుపుర్‌ సనన్‌ కథానాయిక. 'మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని భక్తకన్నప్ప చరిత్రను ఆదర్శంగా తీసుకుని ఈ చలనచిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. కన్నప్ప వృత్తాంతం 2వ శతాబ్దంలో జరిగిందని, ప్రస్తుతం ఇక్కడి పరిసరాల్లో చలనచిత్రం తీయడం వీలుకాదు. అందుకోసం ఈ చిత్ర నిర్మాణానికి ఆర్నెల్లపాటు న్యూజిల్యాండ్‌కు వెళ్తున్నాం. 
 
కన్నప్ప భక్తిని, ఆయన గొప్పతనాన్నీ నేటి తరానికి తెలియజేయాలనే సంకల్పంతో పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్న చిత్రమిది. భారీ బడ్జెట్‌తో... అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో సిద్ధం చేస్తున్నాం. పరుచూరి గోపాలకృష్ణ, బుర్ర సాయిమాధవ్‌, తోట ప్రసాద్‌ కథకి కీలకమైన మెరుగులు దిద్దారు. మణిశర్మ, స్టీఫెన్‌ దేవాసి సంగీతం అందిస్తారు. ఒకే షెడ్యూల్‌లో చిత్రీకరణ పూర్తి చేస్తాం' అని ఈ సినిమా ఓపెనింగ్‌ రోజు విష్ణు ప్రకటించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫ్యాషన్ పేరుతో జుట్టు కత్తిరించారో అంతే సంగతులు.. పురుషులను టార్గెట్ చేసిన తాలిబన్

తెలంగాణ, రామగుండంలో భూకంపం సంభవిస్తుందా?

భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)

అప్పుడేమో వరినాటు.. ఇప్పుడు వరిని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ (video)

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments