Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెబల్ స్టార్ ఆది పురుష్ అప్డేట్.. 2022 ఆగష్టు 11న విడుదల

Webdunia
సోమవారం, 27 సెప్టెంబరు 2021 (13:33 IST)
Adipurush
రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తున్నారు. ముందుగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ' రాధే శ్యామ్' సినిమా కంప్లీట్ చేశారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. మరోవైపు ప్రభాస్.. ఆదిపురుష్, సలార్‌ మూవీలతో ప్రాజెక్ట్ K సినిమాలు చేస్తున్నారు. ఆదిపురుష్ సినిమాను వచ్చే యేడాది స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా 2022 ఆగష్టు 11న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. 
 
ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ఓం రావత్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నారు. ప్రభాస్‌తో మరో సూపర్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో లంకేశ్‌గా నటిస్తున్నారు. ఇక సీత పాత్రలో కృతిసనన్ నటిస్తోంది. ప్రభాస్ సోదరుడు అంటే రామునికి లక్ష్మణుడి పాత్రలో యువ నటుడు సన్నీ సింగ్ నటిస్తున్నారు.
 
"సోను కె టిటు కి స్వీటీ" అనే చిత్రంలో కనిపించిన ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు ప్రభాస్‌కు తమ్ముడిగా కనిపించనున్నారు. ఇక ఈ సినిమా కోసం దాదాపు 300 కోట్ల బడ్జెట్ కేటాయించారని తెలుస్తోంది. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోంది. ఈ సినిమా ఇటు హిందీతో పాటు, తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలకానుంది.
 
ఈ సినిమాను భూషణ్ కుమార్ (టీ సిరీస్), ప్రసాద్ సుతార్‌, రాజేశ్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ షూట్ ప్రారంభానికి ముందే సంచనాలు సృష్టిస్తోంది. ఈ ఎపిక్ పీరియడ్ యాక్షన్ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కోసం అవతార్, స్టార్ వార్స్ ఫేమ్ స్పెషలిస్టులను నిర్మాతలు సంప్రదించారని కథనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. ఆ తర్వాత పూర్తి సమయం గ్రాఫిక్స్‌కు కేటాయించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫెంజల్ తుపాను: కడపలో ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరిక, తిరుపతి నుంచి వెళ్లాల్సిన 4 విమానాలు రద్దు

అదానీ కంపెనీలో ఒప్పందాలు జగన్‌కు తెలియవా? పురంధేశ్వరి ప్రశ్న

కొనసాగుతున్న ఉత్కంఠత : 24 గంటల్లో కీలక ప్రకటన..?

రాంగోపాల్ వర్మ ఎక్కడున్నారు? పోలీసులు ఎందుకు ఆయన కోసం వెతుకుతున్నారు

ఏక్‌నాథ్ షిండేను తప్పించే వ్యూహాల్లో కమలనాథులు : శివసేన నేత ఆరోపణలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments