ప‌దేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ థియేట‌ర్ల‌లో రెబెల్ రీ-రిలీజ్

Webdunia
శనివారం, 8 అక్టోబరు 2022 (19:19 IST)
Rebel
స్టార్ హీరో ప్ర‌భాస్ రెబెల్ ప‌దేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ థియేట‌ర్ల‌లో రీ-రిలీజ్ కాబోతుంది. రొటీన్ పాయింట్ కార‌ణంగా రెబెల్ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్‌గా నిలిచింది. నిర్మాత‌ల‌కు తీవ్ర న‌ష్టాల‌ను మిగిల్చింది. ఈ సినిమా విష‌యంలో నిర్మాత‌ల‌కు లారెన్స్‌తో విభేదాలు వ‌చ్చాయి. 
 
కాగా ఈ ఫ్లాప్ సినిమాను థియేట‌ర్ల‌లో మ‌ళ్లీ రీ-రిలీజ్ చేయ‌బోతున్నారు. ప్ర‌భాస్ పుట్టిన‌రోజును సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 15న రీ-రిలీజ్ కానుంది. రెబెల్ సినిమాను న‌ట్టికుమార్ రీ-రిలీజ్ చేయ‌నున్నారు.
 
రెబెల్‌ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డంతో పాటు సంగీతాన్ని లారెన్స్ అందించాడు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ ఆదిపురుష్ ప్ర‌మోష‌న్స్‌తో బిజీగా ఉన్నాడు. ఇటీవ‌ల ఈ సినిమా టీజ‌ర్ విడుద‌లైంది. 
 
రామాయ‌ణ గాథ ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్ర‌భాస్ రాముడిగా న‌టిస్తున్నాడు. ఓంరౌత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న రిలీజ్ కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కరూర్‌ బాధితులను కలిసిన టీవీకే చీఫ్ విజయ్ - దర్యాప్తు చేపట్టిన సీబీఐ

నత్తలా నడుచుకుంటూ వస్తున్న మొంథా తుఫాను, రేపు రాత్రికి కాకినాడకు...

పెరగనున్న ఏపీ జిల్లాల సంఖ్య.. ఆ రెండు జిల్లాల భాగాలను విలీనం చేస్తారా?

తుఫాను ప్రారంభమైంది... భూమిని సమీపించే కొద్దీ తీవ్రమవుతుంది.. ఏపీఎస్డీఎంఏ

ఇంటి ముందు పెరిగిన గడ్డిని తొలగిస్తున్న యువతిని కాటేసిన పాము.. మూడు ముక్కలైనా..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments