Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంగీతం కోసం కొత్త ప‌క్రియ చేస్తున్న‌ ప్రభాస్ రాధే శ్యామ్

Webdunia
గురువారం, 11 ఫిబ్రవరి 2021 (19:54 IST)
Radhe syam
ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “రాధే శ్యామ్”.  ప్రేమ‌క‌థ‌ను కొత్త‌గా ఆవిష్క‌రించే క్ర‌మంలో సంగీతానికి పెద్ద పీట వేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇందుకోసం దేశంలో వున్న మెలోడి కింగ్ మాస్ట‌ర్ల‌ను వ‌డ‌పోత పడుతున్నారు.

నాలుగు బాష‌ల్లో వ‌స్తున్న ఈ సినిమా కోసం బాలీవుడ్‌లో ప్ర‌త్యేక క‌స‌ర‌త్తు చేశారు. బాలీవుడ్ ఫేమ్ మిథున్ సంగీతం అందిస్తున్నారు. ఇప్ప‌టిక‌కే రెండు పాట‌ల‌కు బాణీలు చేశారు. కుమార్‌, మ‌నోజ్ సాహిత్యాన్ని స‌మ‌కూర్చారు. ఇక తెలుగు, త‌మిళం వ‌చ్చేస‌రికి ద‌క్షిణాది భాష‌ల‌కు తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్ అందిస్తున్నాడు. ఇప్ప‌టికే ఒక ట్రాక్‌ను ఆయ‌న కంపోజ్ చేశాడు. కృష్ణ‌కాంత్ సాహిత్యం అందించారు. 
 
సంగీతం అనేది పామ‌రుల బాష‌. క‌నుక‌నే అంద‌రినీ అల‌రించేలా ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్లాన్ చేశారు. ఇలా చేయ‌డం అరుదైన విష‌య‌మ‌ని చిత్ర యూనిట్ చెబుతోంది.  ఇద్ద‌రు సంగీత ద‌ర్శ‌కులున్నా సేమ్ ఎమోష‌న్స్‌ను అందిస్తార‌ని భ‌రోసా ఇస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా సంగీతంపై మంచి బజ్ ఉంది. మరి ఈ సినిమాలో పాటలు ఎలా ఉంటాయో చూడాలి. పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాను గుల్హ‌న్ కుమార్, టీ సిరీస్ స‌మ‌ర్పిస్తుంది. యు.వి. క్రియేష‌న్స్ నిర్మిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments