Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇటలీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న రాధేశ్యామ్!

Webdunia
బుధవారం, 4 నవంబరు 2020 (16:40 IST)
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "రాధేశ్వామ్". పూజా హెగ్డే హీరోయిన్. కరోనా వైరస్ కారణంగా స్వదేశంలో జరపాల్సిన షూటింగ్‌ను ఇటలీలో ప్లాన్ చేశారు. ఈ షూటింగ్ కూడా ఇటీవలే పూర్తిచేసుకుంది. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది.
 
అక్కడ కరోనా వైరస్‌ రెండో దశ మొదలైనప్పటికీ చిత్ర యూనిట్‌ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ చిత్రీకరణ పూర్తి చేసుకొంది. అక్కడ కీలక సన్నివేశాలతోపాటు పాటల్ని తెరకెక్కించారు. సోమవారం 'రాధేశ్యామ్‌' బృందం హైదరాబాద్‌కి చేరుకుంది.
 
త్వరలో తాజా షెడ్యూల్‌ హైదరాబాద్‌లో మొదలుకానుంది. దీని కోసం అన్నపూర్ణ స్టూడియో, రామోజీ ఫిల్మ్‌సిటీలో సెట్లు వేస్తున్నారని సమాచారం. మరో 20 రోజులు చిత్రీకరణ జరిపితే సినిమా పూర్తవుతుందన్నది టాలీవుడ్ ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 
 
ఈ చిత్రంలో ప్రభాస్‌ సరసన నటిస్తున్న పూజా హెగ్డే ఇటలీ ఎయిర్‌పోర్ట్‌లో తీసుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసి 'టీమ్‌ అందరి సహకారంతో ఇటలీ షెడ్యూల్‌ విజయవంతంగా పూర్తయింది. త్వరలో హైదరాబాద్‌లో కలుద్దాం' అంటూ పోస్ట్ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశంలో H125 హెలికాప్టర్ల తయారీ యూనిట్‌- ఏపీలో ఏర్పాటు అవుతుందా?

చిరంజీవి బీజేపీలో చేరే అవకాశం వుందా?

హైదరాబాదులో ఒక అరటిపండు ధర రూ.100లు... రష్యా టూరిస్ట్ వీడియో వైరల్ (video)

Pawan Kalyan: పవన్ కల్యాణ్- నారా లోకేష్‌లతో బండి సంజయ్ (ఫోటో వైరల్)

Pawan Kalyan: జనసేన కార్యాలయంపై డ్రోన్ కలకలం.. భద్రత లోపాలపై పీకే ఫ్యాన్స్ ఆందోళన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరం లావయ్యేందుకు కారణమయ్యే అలవాట్లు ఇవే

నువ్వుండలను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

భారతదేశంలో సామ్‌సంగ్ హెల్త్ యాప్‌లో వ్యక్తిగత ఆరోగ్య రికార్డుల ఫీచర్‌ను ప్రవేశపెట్టిన సామ్‌సంగ్

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

తర్వాతి కథనం
Show comments