Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సాహో' షూటింగ్ జరుగుతుండగానే.. జిల్ రాధాకృష్ణ- పూజా హెగ్డేతో ప్రభాస్

''బాహుబలి'' స్టార్ ప్రభాస్ తాజాగా ''సాహో'' సినిమా షూటింగ్‌లో బిజీ బీజీగా వున్నాడు. బాహుబలికి తర్వాత సాహో సినిమాకు చాలా గ్యాప్ ఇవ్వడంతో తదుపరి సినిమాకు ఇలాంటి గ్యాప్ వుండకుండా చూసుకోవాలని ప్రభాస్ నిర్ణ

Webdunia
గురువారం, 26 ఏప్రియల్ 2018 (12:51 IST)
''బాహుబలి'' స్టార్ ప్రభాస్ తాజాగా ''సాహో'' సినిమా షూటింగ్‌లో బిజీ బీజీగా వున్నాడు. బాహుబలికి తర్వాత సాహో సినిమాకు చాలా గ్యాప్ ఇవ్వడంతో తదుపరి సినిమాకు ఇలాంటి గ్యాప్ వుండకుండా చూసుకోవాలని ప్రభాస్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ఒకేసారి రెండు సినిమాలు సెట్స్‌పై ఉండేలా చూడాలని ప్రభాస్ నిర్ణయించుకున్నాడు. 
 
ఇందులో భాగంగా ''సాహో'' సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగానే, మరో వైపున కృష్ణంరాజు సొంత సినిమాను చేయడానికి రెడీ అవుతున్నాడు. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. పూజా హెగ్డే కథానాయికగా నటించనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూలై ఏడో తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ చిత్రం తెలుగు, తమిళంలో విడుదల చేసేందుకు సినీ యూనిట్ ప్లాన్ చేస్తోంది.
 
ప్రభాస్‌తో సినిమాపై హీరోయిన్ పూజా హెగ్డే మాట్లాడుతూ.. ఎంటర్‌టైనింగ్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కుతోందని చెప్పింది. ఇప్పటికే ప్రభాస్-రాధాకృష్ణ సినిమా కోసం తనను సంప్రదించారని.. ఈ సినిమా స్టోరీ అదిరిపోయిందని.. ఈ ఛాన్స్ తనకు రావడంతో ఎగిరి గంతేశానని పూజా హెగ్డే చెప్పుకొచ్చింది. ఇప్పటికే హృతిక్ రోషన్‌ మొహంజదారో సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సాహో స్టార్‌తో నటించడంపై పూజా హెగ్డే హర్షం వ్యక్తం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పదవులపై ఆశలేదు.. జనసేన కార్యకర్తగానే ఉంటాను : నాగబాబు

'ఆపరేషన్ మహదేవ్' ... పహల్గాం ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్

గబ్బిలాల వేట.. చిల్లీ చికెన్ పేరుతో హోటళ్లకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు సప్లై.. ఎక్కడ?

నెల్లూరులో ఏం జరిగిందంటే? ప్రియుడిని ఇంటికి పిలిపించి హత్య చేసింది

Flood Alert: గోదావరి నదికి వరదలు.. ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments