Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచి మనసు చాటుకున్న ప్రభాస్.. ఫ్యాన్ కుటుంబానికి ఆర్థికసాయం

Webdunia
మంగళవారం, 15 మార్చి 2022 (12:54 IST)
పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌​ మంచి మనసును చాటుకున్నారు. ఇటీవల మృతి చెందిన అభిమాని కుటుంబానికి అండగా నిలిచారు. వివరాల్లోకి వెళ్తే.. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ప్రేమకథా చిత్రం రాధే శ్యామ్. ఈ చిత్రంలో ప్రభాస్ హస్తసాముద్రికుడైన విక్రమాదిత్యగా, పూజా హెగ్డే డాక్టర్ ప్రేరణగా నటించారు. 
 
ఈ రాధేశ్యామ్‌ సినిమా విడుదల సందర్భంగా గత గురువారం రాత్రి కారంపూడిలోని ఐమ్యాక్స్‌ థియేటర్‌ దగ్గర ప్రభాస్‌ 30 అడుగుల బ్యానర్‌ కడుతుండగా ప్రమాదం జరిగింది. 37 ఏళ్ల చల్లా కోటేశ్వరరావు ప్రభాస్‌కు పెద్ద ఫ్యాన్‌. 
 
సినిమా విడుదల సందర్భంగా ఫ్లెక్సీ కడుతుండగా, అది కాస్తా కరెంట్‌ తీగలపై పడింది. దీంతో ఫ్లెక్సీని పట్టుకుని ఉన్న కోటేశ్వరరావు కరెంట్‌ షాక్‌కు గురై తీవ్ర గాయాలపాలై మృతి చెందాడు. 
 
ఈ నేపథ్యంలో మృతి చెందిన ఫ్యాన్ కుటుంబానికి ప్రభాస్ అండగా నిలిచారు. ఇంకా అభిమాని కుటుంబానికి ప్రభాస్ రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించారు. పెదకోటేశ్వరరావు భార్య పిచ్చమ్మకు, తల్లిదండ్రులకు చెక్కును అందించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహా న్యూస్ చానెల్‌‍పై దాడిని తీవ్రంగా ఖండించిన పవన్ కళ్యాణ్

కాంగ్రెస్ నేతలంటే అపార గౌరవం... సీరియస్‌గా తీసుకోవద్దు : కొండా మురళి

భర్తకి 12 మంది స్త్రీలతో వివాహేతర సంబంధం, భార్యను 8 సార్లు కత్తితో పొడిచాడు

ఐఫోన్‌లో షూట్ చేస్తే రీల్స్ ఎక్కువగా వస్తాయనీ.. యువకుడి గొంతు కోశారు..

లాక్కెళ్లి గదిలో బంధిస్తే.. పారిపోయేందుకు యత్నించగా హాకీ స్టిక్‌తో తలపై కొట్టారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

తర్వాతి కథనం
Show comments