ప్రభాస్ త్వరలోనే మంచి అమ్మాయిని చూసి పెళ్ళి చేసుకుంటాడు

బాహుబలి హీరో ప్రభాస్ పెళ్లి గురించి రోజుకో వార్త పుట్టుకొస్తుంది. ప్రభాస్ ప్రస్తుతం దేవసేన ప్రేమలో వున్నాడని, 2018వ సంవత్సరం ప్రభాస్ ఫ్యాన్స్‌ సర్‌ప్రైజ్ వుంటుందని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్

Webdunia
సోమవారం, 27 నవంబరు 2017 (15:58 IST)
బాహుబలి హీరో ప్రభాస్ పెళ్లి గురించి రోజుకో వార్త పుట్టుకొస్తుంది. ప్రభాస్ ప్రస్తుతం దేవసేన ప్రేమలో వున్నాడని, 2018వ సంవత్సరం ప్రభాస్ ఫ్యాన్స్‌ సర్‌ప్రైజ్ వుంటుందని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్న తరుణంలో.. ఆక్సిజన్ హీరో గోపిచంద్.. ప్రభాస్ పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్లు చేశాడు. 
 
తన చిరకాల మిత్రుడు ప్రభాస్ వివాహం విషయమై ఆక్సిజన్ సినిమా ప్రమోషన్‌లో మాట్లాడుతూ.. బాహుబలితో బిజీగా వుండటంతో ప్రభాస్ పెళ్లి గురించి ఆలోచించలేదని.. ఆ విషయాన్ని పక్కనబెట్టాడని.. ప్రస్తుతం కాస్త రిలాక్స్‌గా వుండటంతో త్వరలో మంచి అమ్మాయిని చూసి ప్రభాస్ వివాహం చేసుకుంటాడని చెప్పాడు. నవంబర్ 30వ తేదీన ఆక్సిజన్ విడుదల కానుంది. ప్రభాస్‌తో సినిమా చేసేందుకు రెడీగా వున్నానని మంచి స్క్రిప్ట్ దొరకట్లేదని చెప్పుకొచ్చాడు. 
 
ఇక ఆక్సిజన్ గురించి చెప్తూ.. చాలా గ్యాప్ తర్వాత నిర్మాత ఏఎం రత్నంను నమ్మి చేశానన్నాడు. ఈ చిత్రంలో తనలోనూ ఆక్సిజన్ నింపుతుందని భావిస్తున్నట్లు వెల్లడించాడు. జ్యోతికృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో గోపీచంద్ సరసన రాశిఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర... రాజోలులో రెక్కీ సక్సెస్

తీవ్రరూపం దాల్చిన దిత్వా తుపాను - ఏపీలో అత్యంత భారీ వర్షాలు

తాగుబోతు భర్త వేధింపులు.. భరించలేక హత్య చేసిన భార్య

Pawan Kalyan: అమరావతి అభివృద్ధికి కేంద్రం అమూల్యమైన మద్దతు.. పవన్ కల్యాణ్

కియర్ని- స్విగ్గీ వారి హౌ ఇండియా ఈట్స్ 2025 ఎడిషన్: డిన్నర్ కంటే అర్థరాత్రి భోజనాలు 3 రెట్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments