Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్‌ని ఢీ కొట్టబోతున్న స్టైలీష్ విలన్ ఇతనే..!

Webdunia
గురువారం, 7 మే 2020 (22:12 IST)
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని యు.వి.క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్‌తో ప్రభాస్ మూవీ చేస్తున్నారు. ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్ పైన సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. 
 
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. వచ్చే సంవత్సరం ప్రథమార్ధంలో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. అయితే.. ఈ సినిమాలో విలన్ పాత్రను ఎవరితో చేయించాలా అని ఆలోచిస్తే.. స్టైలీష్ విలన్ అరవింద్ స్వామి అయితే కరెక్ట్ సరిపోతారని టీమ్ అనుకోవడంతో అరవింద్ స్వామిని కాంటాక్ట్ చేసారని తెలిసింది. ఫోన్లో మూవీ స్టోరీ, అతని క్యారెక్టర్ చెబితే.. చాలా బాగుంది అంటూ వెంటనే ఓకే చెప్పాడని తెలిసింది. 
 
పాన్ ఇండియా మూవీగా కాకుండా పాన్ వరల్డ్ మూవీగా రూపొందుతోన్న ఈ సినిమా ఓ కొత్త అనుభూతి కలిగించేలా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ నటించనున్నట్టు సమాచారం. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ ఏ రేంజ్‌లో ఉందో తెలిసిందే. మరి.. ఈ సినిమాతో ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుమల: లోయలో దూకేసిన భక్తుడు.. అతనికి ఏమైందంటే? (video)

తానూ ఓ మహిళే అన్న సంగతి మరిచిన వార్డెన్.. విద్యార్థినిల స్నానాల గదిలో సీక్రెట్ కెమెరా అమర్చింది...

నా కోడలికి వివాహేతరం సంబంధం, భరించలేకే నా కొడుకు సూసైడ్: తల్లి ఆరోపణ

పాకిస్థాన్‌లో మరో కొత్త రాజకీయ పార్టీ.. ఎవరు స్థాపించారంటే...

బస్సులో డెలివరీ.. బిడ్డను కిటికీలో నుంచి విసిరేసిన తల్లి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments