Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్ర‌భాస్ జాన్ ఇప్ప‌ట్లో రిలీజ్ కాదా..?

Webdunia
శనివారం, 21 డిశెంబరు 2019 (17:56 IST)
యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్.. సాహో ఆశించిన స్ధాయిలో ఆక‌ట్టుకోక‌పోవ‌డంతో ఈసారి ఖ‌చ్చితంగా విజ‌యం సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఇంకా చెప్పాలంటే క‌సితో జాన్ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రం జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోంది. యు.వి. క్రియేష‌న్స్, గోపీకృష్ణ మూవీస్ సంస్థ‌లు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. తాజా షెడ్యూల్ స్టార్ట్ కావాలి కానీ.. క‌థ పై క‌స‌ర‌త్తులు చేస్తుండ‌డం వ‌ల‌న ఇంకా లేటెస్ట్ షెడ్యూల్ ప్రారంభం కాలేదు.
 
ప్ర‌భాస్ స‌ర‌స‌న‌ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాను వైవిధ్య‌మైన ప్రేమ‌క‌థా చిత్రంగా రూపొందిస్తుండ‌డంతో అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమాని చూద్దామా అని ఎదురు చూస్తున్నారు. స‌మ్మ‌ర్ లో రిలీజ్ చేస్తార‌ని గ‌తంలో వార్త‌లు వ‌చ్చాయి కానీ.. ఇంకా తాజా షెడ్యూల్ ప్రారంభం కాక‌పోవ‌డంతో ఇప్ప‌ట్లో ఈ సినిమా రిలీజ్ ఉండ‌ద‌ని గ‌ట్టిగా ప్ర‌చారం జ‌ర‌గుతోంది.
 
ఇట‌లీ బ్యాక్ డ్రాప్‌తో రూపొందుతోన్న ఈ భారీ చిత్రం కోసం అన్న‌పూర్ణ సెవెన్ ఏక‌ర్స్ లో భారీ సెట్ వేస్తున్నారు.  ద‌స‌రాకైనా ఈ సినిమాని రిలీజ్ చేయాల‌ని ఈ చిత్ర ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నార‌ట‌. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ విదేశాల్లో ఉన్నారు. వ‌చ్చిన త‌ర్వాత త్వ‌ర‌లో లేటెస్ట్ షెడ్యూల్ హైద‌రాబాద్ లో ప్రారంభించ‌నున్నారు. మ‌రి.. అన్నీ అనుకున్న‌ట్టుగా జ‌రిగితే ద‌సరాకి జాన్ రావ‌చ్చు. అలా జ‌ర‌గ‌క‌పోతే.. ఇంకా లేట్ కావ‌చ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Tirupati Stampede తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్లకై తొక్కిసలాట: ఆరుగురు భక్తులు మృతి

ఆ 3 గ్రామాల ప్రజలకు ఒక్క వారం రోజులలో బట్టతల వచ్చేస్తోంది, ఏమైంది?

TSPSC-గ్రూప్ 3 పరీక్ష- కీ పేపర్స్ విడుదల.. మే 1 నుంచి కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు

ఖమ్మం పాఠశాలలో ఒకే ఉపాధ్యాయుడు- ఒకే ఒక విద్యార్థి

Modi: విశాఖపట్నంలో ప్రధాని గ్రాండ్ రోడ్ షో.. పూల వర్షం కురిపించిన ప్రజలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments