Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా మధ్య ఎలాంటి వివాదం లేదంటోన్న‌ హీరో ప్రభాస్

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం సాహో చిత్రంలో న‌టిస్తున్నారు. ర‌న్ రాజా ర‌న్ ఫేమ్ సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇదిలా ఉంటే.. బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహర్‌కు, ప్ర‌భాస్ మధ్య కోల్డ్ వార్ నడుస్త

Webdunia
గురువారం, 24 మే 2018 (20:43 IST)
యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం సాహో చిత్రంలో న‌టిస్తున్నారు. ర‌న్ రాజా ర‌న్ ఫేమ్ సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇదిలా ఉంటే.. బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహర్‌కు, ప్ర‌భాస్ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఎందుకంటే.. బాహుబ‌లి త‌ర్వాత క‌ర‌ణ్ జోహార్ ప్ర‌భాస్‌తో సినిమా చేయాలి అనుకున్నారు కానీ... ప్ర‌భాస్ మాత్రం సింపుల్‌గా నో చెప్పేసి ముందుగా క‌మిట్ అయిన సుజిత్ సినిమా సాహో స్టార్ట్ చేసాడు.
 
దీంతో ప్ర‌భాస్, క‌ర‌ణ్ జోహార్ మ‌ధ్య కోల్డ్ వార్ అంటూ ప్ర‌చారం మొద‌లైంది. దుబాయ్‌లో ‘సాహో’ సినిమా షూటింగ్ షెడ్యూల్ పూర్తయింది. ఈ సందర్భంగా అక్కడి మీడియాతో ప్రభాస్ మాట్లాడుతూ... మా ఇద్దరి మధ్య వివాదం ఉన్నట్టుగా వార్తలు వస్తున్న విషయాన్ని కరణ్ జోహార్ తనకు ఫోన్ చేసి చెప్పారని అన్నారు. 
 
ఈ వదంతులు అబద్ధమని, వాటిని నమ్మొద్దని చెప్పారు. కాగా, బాలీవుడ్‌కు ప్రభాస్‌ను పరిచయం చేయాలని కరణ్ జోహార్ ప్రయత్నించారని, అందుకు, ప్రభాస్ అంగీకరించలేదు అంటూ ఇన్నాళ్లూ హల్చల్ చేశాయి. మ‌రి... ప్రభాస్ చేసిన ప్రకటనతో అయ‌నా ఈ ప్ర‌చారాని ఫుల్ స్టాప్ ప‌డుతుందేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కల్యాణ్‌ను డిప్యూటీ సీఎం నుంచి తొలగిస్తే ఎట్లుంటుంది? (Video)

Republic Day: గణతంత్ర దినోత్సవం.. ఆగస్టు 15.. జెండా ఆవిష్కరణలో తేడా ఏంటంటే? (video)

Mumbai crime: 75ఏళ్ల వృద్ధురాలిపై 20 ఏళ్ల వ్యక్తి అత్యాచారం.. ఇంట్లోకి చొరబడి?

YS Sharmila: జగన్ బీజేపీ దత్తపుత్రుడు.. ఇకనైనా విజయసాయి నిజాలు చెప్పాలి.. షర్మిల

DJ Tillu Song: DJ టిల్లు పాటకు స్టెప్పులేసిన మంత్రి సీతక్క.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తెలంగాణ, ఏపిలో అధునాతన హెమటాలజీ ఎనలైజర్‌ను పరిచయం చేసిన ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

కరకరమనే అప్పడాలు, కాళ్లతో తొక్కి మరీ చేస్తున్నారు (video)

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

తర్వాతి కథనం
Show comments