Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరుష్క తరహాలో #pranushkaల వివాహం ఎప్పుడు..? జంటగా మెరిశారే? (video)

Webdunia
బుధవారం, 2 జనవరి 2019 (17:09 IST)
ప్రముఖ దర్శకుడు రాజమౌళి కుమారుడి వివాహంలో బాహుబలి జంట మెరిసింది. ఈ పెళ్లికి హాజరైన ప్రభాస్-అనుష్క జోడీని చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. జక్కన్న కుమారుడి పెళ్లిలో అలా జంటగా ప్రభాస్-అనుష్క కనిపించేయడంతో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుంటారని.. వీరిద్దరూ ప్రేమలో వున్నారని ప్రచారం మొదలైంది. నెట్టింట అనుష్క- ప్రభాస్‌ల జంట కనిపించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. 
 
ఇంకా అనుష్క, ప్రభాస్.. వీరిద్దరిని చూసి ఫ్యాన్స్ పండగ చేసుకునే విధమైన మీమ్స్‌ చక్కర్లు కొడుతున్నాయి. దక్షిణాది హీరోయిన్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్న అనుష్క.. బాహుబలితో అంతర్జాతీయ గుర్తింపును సంపాదించుకుంది. ఈ సినిమా ద్వారా భారీ కలెక్షన్లు వచ్చాయి. బాహుబలి తర్వాత భాగమతి సినిమాలో అనుష్క నటించింది. కానీ ఆపై బరువు తగ్గేందుకు కొంత సమయం తీసుకున్న అనుష్క ప్రస్తుతం సినిమాల్లో నటించేందుకు సంతకాలు చేసేసింది. కానీ 37 ఏళ్ల అనుష్క ఇంకా వివాహం చేసుకోలేదు. ప్రస్తుతం ఆమె కోసం వరుడిని వెతుకుతున్నారు.. ఆమె తల్లిదండ్రులు.
 
అయితే అనుష్క, ప్రభాస్‌ల మధ్య ప్రేమాయణం వుందని బాహుబలి తర్వాత జోరుగా ప్రచారం సాగింది. కానీ ఈ వార్తలను వీరిద్దరూ ఖండించారు. మంచి స్నేహితులమేనని చెప్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో రాజమౌళి కుమారుడి వివాహంలో అనుష్క, ప్రభాస్ జంటగా కనిపించడం మళ్లీ వీరిలో ప్రేమ పుట్టిందనే చర్చకు దారితీసింది. సంగీత్‌లో డ్యాన్స్ చేసేటప్పుడు.. పెళ్లి మండపం వేదికపైనా వీరిద్దరూ జంటగా కనిపించారు. దీంతో వీరిద్దరి వివాహం ఖాయమని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మరి ఈ వార్తలపై మళ్లీ ప్రఅనుష్కలు ఏమంటారో వేచి చూడాలి. 

సంబంధిత వార్తలు

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోపు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

టీవీ యాంకర్‌కు నిద్రమాత్రలు కలిపి... లైంగికదాడికి పాల్పడిన పూజారి!!

తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా తరలించారు!!

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments