Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్ ముదురు బ్యాచిలర్‌తో జోడీ కడుతున్న అక్కినేని కోడలు

Webdunia
సోమవారం, 1 ఏప్రియల్ 2019 (14:24 IST)
సమంతకు పెళ్లి తర్వాత దశ తిరిగిపోయింది. పెళ్లి తర్వాత ఆమె నటించిన చిత్రం "రంగస్థలం". ఈ చిత్రం బాక్సాఫీట్ రికార్డులను తిరగరాసింది. ఆ తర్వాత ఆమె నటించిన పలు చిత్రాలు విజయం సాధించాయి. ఇలా వరుస విజయాలతో ముందుకెళుతున్న సమంత... తాజా టాలీవుడ్ ముదురు బ్యాచిలర్ ప్రభాస్‌తో కలిసి నటించనుంది. 
 
ఇటు తెలుగు, అటు తమిళ భాషల్లో నటిస్తూ మంచి విజయాలను సొంతం చేసుకుంటోంది. తాజాగా ఆమె తమిళంలో నటించిన సూపర్ డీలక్స్ చిత్రం కూడా మంచి హిట్ సాధించింది. ఇందులో తమిళ హీరో విజయ్ సేతుపతి హిజ్రాగా నటించారు. ఈ చిత్రంలో సమంత పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. ఇలా నటనకి ప్రాధాన్యత కలిగిన విభిన్నమైన పాత్రలను చేస్తూ మరిన్ని మార్కులను కొట్టేస్తోంది. 
 
అలాంటి సమంత త్వరలో ప్రభాస్ సరసన కనిపించనుందనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ ఒక వైపున 'సాహో' షూటింగులోను.. మరో వైపున 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలోను చేస్తున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్‌కి 'జాన్' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు.
 
ఈ ప్రాజెక్టు తర్వాత ఆయన దిల్ రాజు నిర్మాణంలో ఒక సినిమా చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఒక క్రేజీ డైరెక్టర్‌తో కథను సిద్ధం చేయిస్తోన్న దిల్ రాజు, ఈ సినిమాలో కథానాయికగా సమంతను ఎంపిక చేసుకున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తోన్న సినిమాలు పూర్తికాగానే, ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని అంటున్నారు. అయితే, దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సూట్‌కేసులో భార్య మృతదేహం.. పూణెలో భర్త అరెస్టు!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి సీఐడీ కోర్టులో ఎదురుదెబ్బ

Drone: లారీ ట్రక్కులో పేకాట.. డ్రోన్ సాయంతో మఫ్టీలో వెళ్లిన పోలీసులు.. అరెస్ట్ (video)

Chandrababu Naidu: ఇఫ్తార్ విందులో చంద్రబాబు.. పేద ముస్లిం ఆకలితో ఉండకుండా..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments