''సాహో'' తర్వాత ''జిల్''తో ప్లేబాయ్‌గా ప్రభాస్

మంగళవారం, 26 మార్చి 2019 (11:24 IST)
సాహో సినిమాకు తర్వాత బాహుబలి స్టార్ ప్రభాస్ నటించబోయే సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడి అయ్యాయి. సాహో షూటింగు చాలా వరకూ పూర్తికావడంతో తదుపరి సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు ప్రభాస్ రెడీ అయిపోయాడు. ఈ క్రమంలో 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ సినిమాపై ప్రభాస్ దృష్టిపెట్టాడు. ఆల్రెడీ ఒక షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా, రీసెంట్‌గా మరో షెడ్యూల్‌ను మొదలుపెట్టింది. 
 
1960 కాలం నాటి ప్రేమకథతో ఈ సినిమా సాగుతుందని ప్రచారం సాగుతోంది. ఇందులో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని సమాచారం. ఇందులో సిన్సియర్ లవర్, ప్లేబాయ్‌గా రెండో కోణాల్లో ప్రభాస్ కనిపించనున్నాడు. 
 
ఇందులో నాయికగా పూజా హెగ్డే పేరు మాత్రమే వినిపించింది. మరో కథానాయికగా కాజల్ కనిపించనుందని టాక్ వస్తోంది. సిన్సియర్ లవర్ కి జోడీగా పూజా హెగ్డే .. ప్లే బాయ్ పాత్ర సరసన కాజల్ కనిపిస్తుందని అంటున్నారు. ఇకపోతే.. ఈ సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ''మ‌న్మ‌థుడు'' సినిమాకు సీక్వెల్.. రకుల్, నాగార్జున జంటగా..?