Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ - నాగ్ అశ్విన్ మూవీలో అమితాబ్, బిగ్ ఎనౌన్స్‌మెంట్

Webdunia
శుక్రవారం, 9 అక్టోబరు 2020 (14:55 IST)
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ చిత్రం రాథేశ్యామ్. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వి. క్రియేషన్స్ నిర్మిస్తుంది. ఇటీవల ఈ మూవీ టీమ్ ఇటలీ వెళ్లింది. వచ్చే సంవత్సరం ప్రథమార్ధంలో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
 
ఇదిలావుంటే.. ప్రభాస్, మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్‌తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ నిర్మిస్తుంది. ఇందులో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకునే నటించనున్నట్టు గతంలో ప్రకటించారు. ఇక ఇప్పుడు ఈ సినిమా గురించి మరో బిగ్ ఎనౌన్స్‌మెంట్ వచ్చింది.
 
అది ఏంటంటే.... ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్ నటించనున్నారు. ఈ విషయాన్ని వైజయంతీ మూవీస్ సంస్థ ట్విట్టర్ ద్వారా అఫిషియల్‌గా ఎనౌన్స్ చేసారు. ఇది నిజంగానే బిగ్ ఎనౌన్స్‌మెంట్. బిగ్ బి అమితాబ్ - బాహుబలి ప్రభాస్ కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారంటే.. ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు.
 
ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ మాట్లాడుతూ... ప్రభాస్, అమితాబ్, దీపికా పడుకునే ఇలా భారీ తారాగణంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా సినిమాని రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నాం.
 
 కనీవినీ ఎరుగని విధంగా ఈ సినిమా ఉంటుంది. ప్రేక్షకులకు థ్రిల్ కలిగించేలా ఈ సినిమా ఉంటుంది. 2022లో ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నాం అని తెలియచేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పట్టపగలే చైన్ స్నాచింగ్.. కాలింగ్ బెల్ కొట్టి మహిళ మెడలోని..? (video)

Pune: బస్సులో వేధిస్తావా? పీటీ టీచర్ మజాకా.. 25సార్లు చెంప ఛెల్లుమనిపించింది.. (video)

ఫార్ములా ఈ రేస్‌ వ్యవహారంలో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు

వైసీపీకి వర్మకు ఉన్న సంబంధం అదే.. జీవీ రెడ్డి ఏమన్నారు..?

Srinivas Goud: తిరుమల కొండపై టీటీడీ వివక్ష చూపుతోంది.. ఇది సరికాదు.. శ్రీనివాస్ గౌడ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments