Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ జీక్యూ లుక్ అదిరింది.. ''దందా'' పేరుతో కృష్ణంరాజుతో సినిమా

బాహుబలి, సాహో స్టార్ ప్రభాస్ మళ్లీ వార్తల్లోకెక్కాడు. జీక్యూ మ్యాగజైన్ కవర్ పేజీలో ప్రభాస్ కనిపించాడు. సూటు-కోటుతో కాలు మీద కాలేసుకుని కూర్చున్న ప్రభాస్ లుక్ చూసి.. ఫ్యాన్స్‌తో పాటు డార్లింగ్ మహిళా ఫ్

Webdunia
సోమవారం, 1 జనవరి 2018 (13:50 IST)
బాహుబలి, సాహో స్టార్ ప్రభాస్ మళ్లీ వార్తల్లోకెక్కాడు. జీక్యూ మ్యాగజైన్ కవర్ పేజీలో ప్రభాస్ కనిపించాడు. సూటు-కోటుతో కాలు మీద కాలేసుకుని కూర్చున్న ప్రభాస్ లుక్ చూసి.. ఫ్యాన్స్‌తో పాటు డార్లింగ్ మహిళా ఫ్యాన్స్ కూడా ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
ప్రస్తుతం ప్రభాస్ 'సాహో' సినిమా షూటింగుతో బిజీగా వున్న ప్రభాస్.. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యాక 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్టు సమాచారం. అలాగే కృష్ణంరాజు సొంత బ్యానర్లో ఒక సినిమా చేయనున్నాడని తెలిసింది. రాధాకృష్ణతో 2018 చివరిలో గానీ, 2019 ప్రారంభంలో గాని ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందట.
 
ఆపై ప్రభాస్ కృష్ణం రాజు సొంత పతాకం సినిమా చేస్తారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ సినిమాకి దర్శక నిర్మాతగా కృష్ణంరాజు వ్యవహరించనున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే కృష్ణంరాజు 'దందా' అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయించారు. ఈ టైటిల్ ప్రభాస్‌తో సినిమా కోసమేనని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. పరిగెత్తించి లెక్చరర్‌పై దాడి.. (video)

అప్పుల బాధ.. తెలంగాణలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య.. ఈఎంఐ కట్టలేక?

రేవంత్‌రెడ్డి హయాంలో ప్రజల శాపనార్థాలు తప్పట్లేదు.. కవిత ఫైర్

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments