రష్యన్ భాషలో 'బాహుబలి' .. దుమ్ముదులిపిన ట్రైలర్స్ (వీడియో)
						
		
						
				
భారతీయ చలనచిత్ర పరిశ్రమ రికార్డులను తిరగరాసిన చిత్రం "బాహుబలి". ఈ చిత్రం రెండు భాగాలుగా రాగా, ఈ రెండు భాగాలూ సంచలన విజయాలను నమోదు చేసుకున్నాయి. ప్రభాస్, రానా, రాజమౌళి కాంబినేషన్‌లో ఈ చిత్రం తెరకెక్కిం
			
		          
	  
	
		
										
								
																	భారతీయ చలనచిత్ర పరిశ్రమ రికార్డులను తిరగరాసిన చిత్రం "బాహుబలి". ఈ చిత్రం రెండు భాగాలుగా రాగా, ఈ రెండు భాగాలూ సంచలన విజయాలను నమోదు చేసుకున్నాయి. ప్రభాస్, రానా, రాజమౌళి కాంబినేషన్‌లో ఈ చిత్రం తెరకెక్కింది.
 
									
			
			 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	బాక్సాఫీస్ దగ్గర వసూళ్ళ సునామి సృష్టించిన ఈ చిత్రం త్వరలోనే చైనాలో పెద్ద ఎత్తున విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తుండగా, డిసెంబర్ 29న జపాన్‌లో 'బాహుబలి 2' చిత్రం విడుదల కాబోతుంది. 
 
									
										
								
																	
	 
	అలాగే, రష్యా భాషలోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు నిర్మాత శోభు యార్లగడ్డ తెలిపారు. 2018 జనవరిలో రష్యన్ భాషలో ఈ మూవీ విడుదల కానుంది. అయితే కొద్దిసేపటి క్రితం రష్యన్ భాషకి సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు. ఇది ప్రతి ఒక్కరిని అలరించేలా ఈ ట్రైలర్‌ను కట్ చేశారు. ఆ ట్రైలర్‌పై ఓ లుక్కేయండి.