Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగ చైతన్య నటిస్తున్న కస్టడీ పవర్ ఫుల్ గ్లింప్స్

Webdunia
సోమవారం, 2 జనవరి 2023 (09:18 IST)
Naga Chaitanya
అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు కాంబినేషన్‌ లో రూపొందుతున్న తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం రెండు నెలల క్రితమే సెట్స్ పైకి వెళ్లింది. 'కస్టడీ' అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటిస్తుండగా, ప్రియమణి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. సంపత్ రాజ్, శరత్ కుమార్, ప్రేమ్ జీ, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
 
ఇటివలే ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ డేట్‌ ని ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మే 12, 2023న విడుదలవుతోంది. గ్రాండ్ గా న్యూ ఇయర్ 2023కి స్వాగతం పలుకుతూ.. ఈరోజు మేకర్స్ ఒక స్పెషల్ గ్లింప్స్ ని విడుదల చేశారు.
 
ఈ చిత్రానికి సంబంధించిన నాగ చైతన్య న్యూలుక్ తో పాటు, మొదటి గ్లింప్స్ లో ప్రేక్షకులను, నాగ చైతన్య అభిమానులను ఎక్సయిట్ చేసే అన్ని అంశాలు ఉన్నాయి. గ్రిప్పింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఏరియల్ షాట్‌ లతో టీజర్ ప్రారంభమవుతుంది.  ట్రైన్ దూసుకురావడం, రివర్స్డ్ కార్లు పేలడం, నాగ చైతన్య విలన్స్ కు పవర్ ఫుల్ పంచ్‌ లు, కిక్‌ లు ఇస్తూ యాక్షన్‌ లోకి దిగడం ఎక్స్ ట్రార్డినరీ గా వుంది.
 
 నాగ చైతన్య మాసియస్ట్ అవతార్‌ లో కనిపించారు. యాక్షన్ ఎలిమెంట్స్‌తో పాటు గ్లింప్స్ చివర్లో నాగచైతన్య ఫెరోషియస్ లుక్ క్యూరియాసిటీని పెంచింది. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని అందించారు. సినిమాటోగ్రఫీ అవుట్ స్టాండింగా వుంది.
 
వెంకట్ ప్రభు మరోసారి తన సాంకేతిక నైపుణ్యాన్ని చూపించారు. వీడియో ఆడ్రినలిన్ రష్ ఇస్తుంది. వెంకట్ ప్రభు  తన చిత్రానికి ప్రత్యేకమైన ట్యాగ్‌లైన్‌ ఇవ్వడంలో కూడా దిట్ట. కస్టడీ ట్యాగ్‌లైన్ 'ఎ వెంకట్ ప్రభు హంట్.'   
 
నాగ చైతన్య కెరీర్‌లో అత్యంత ఖరీదైన చిత్రాల్లో కస్టడీ ఒకటి. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన తారాగణం,  అద్భుతమైన సాంకేతిక బృందం ప్రస్తుతం చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. అత్యున్నత నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ ని పవన్‌ కుమార్‌ సమర్పిస్తున్నారు. అబ్బూరి రవి డైలాగ్స్‌ రాస్తుండగా, ఎస్‌ఆర్‌ కత్తిర్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డీఎంకేను గద్దె దించే వరకు చెప్పులు వేసుకోను : బీజేపీ నేత శపథం!!

ఆధారాలు లేకుండా ఈవీఎంలను తప్పుబట్టలేం : సుప్రియా సూలే

సంకీర్ణ ప్రభుత్వంపై చిందులేసిన ఆర్కే రోజా.. తదుపరి ప్రభుత్వం మాదే

అల్లు అర్జున్‌పై ఎలాంటి కోపం లేదు : సీఎం రేవంత్ రెడ్డి

ఫీలింగ్స్ సాంగ్ చేయడం రష్మికకు ఏమాత్రం ఇష్టం లేదు : సీపీఐ నారాయణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Dry cough Home remedies పొడి దగ్గు తగ్గటానికి చిట్కాలు

Foods to lower cholesterol ఈ ఆహారాలతో చెడు కొవ్వుకు చెక్

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

తర్వాతి కథనం
Show comments