Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వ‌ల్ల `ఏక్ మినీ కథ` వాయిదా

Webdunia
మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (12:11 IST)
Ek mini kahta
బయట పరిస్థితులు అస్సలు బాగోలేవు. అందుకే సినిమాలు కూడా విడుదల చేయడం లేదు. ప్రజల ఆరోగ్యం కంటే ఏదీ మాకు ముఖ్యం కాదు.. అందుకే మా సినిమాను వాయిదా వేస్తున్నాం అంటూ చెప్తున్నారు ఏక్ మినీ కథ హీరో సంతోష్ శోభన్. ఎప్రిల్ 30న రావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. కొత్త దర్శకులకు అవకాశం ఇస్తూ, వరుస విజయాలు అందుకుంటున్న నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్. దీనికి అనుబంధ సంస్థగా యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ మొదలు పెట్టారు. ఈ బ్యాన‌ర్ లోనే ఏక్ మినీ కథ సినిమా నిర్మాణం పూర్తైంది. యూవీ కాన్సెప్ట్స్ తో పాటు మ‌రో నిర్మాణ సంస్థ  మ్యాంగో మాస్ మీడియా ఈ సినిమా నిర్మాణంలో భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రిస్తోంది. 
 
ఇప్పటికే విడుదలైన చిత్ర ఫస్ట్ లుక్, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా Does Size Matter అంటూ పోస్టర్ లో ఉన్న మ్యాటర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. పేపర్ బాయ్ సినిమాతో నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న సంతోష్ శోభన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన ఈ మాయలో.., సామిరంగా లిరికల్ సాంగ్స్ యూ ట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్నాయి. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా లాంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ కథ అందించారు. కార్తీక్ రాపోలు ఏక్ మినీ కథ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రవీందర్ ప్రొడక్షన్ డిజైనర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 
 
గోకుల్ భారతి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా ప్రవీణ్ లక్కరాజు సంగీతం సమకూరుస్తున్నారు. సత్య ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. ఈ సినిమాను ఎప్రిల్ 30న విడుదల చేస్తామంటూ ఇదివరకే దర్శక నిర్మాతలు ఖరారు చేసారు. అయితే ప్రస్తుతం కోవిడ్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు దర్శక నిర్మాతలు. ఈ క్రమంలోనే హీరో సంతోష్ శోభన్, నటుడు సుదర్శన్ కలిసి ఓ సరదా వీడియో కూడా చేసారు. పరిస్థితులు అన్నీ చక్కబడిన తర్వాత కొత్త తేదీని అనౌన్స్ చేస్తామని చెప్పారు. అందరూ ఇంట్లోనే సేఫ్‌గా ఉండాలంటూ కోరారు హీరో సంతోష్ శోభన్. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోసాని కృష్ణ మురళిపై సూళ్లూరు పేట పోలీస్ స్టేషన్‌లో కొత్త కేసు

అలేఖ్య చిట్టి పచ్చళ్ల వ్యాపారం క్లోజ్ ... దెబ్బకు దిగివచ్చి సారీ చెప్పింది... (Video)

గుడికి వెళ్లిన అమ్మ.. అమ్మమ్మ... ఆరేళ్ల బాలికపై మేనమామ అఘాయిత్యం!!

కొత్త రికార్డు సాధించిన శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం

వాట్సాప్ గవర్నెన్స్‌లో వెయ్యికి పైగా సేవలు.. చంద్రబాబు కీలక నిర్ణయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments