Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సిక్స్ మినిట్ షాట్ ఒకే టేక్ లో చేసిన శింబు

Advertiesment
సిక్స్ మినిట్ షాట్ ఒకే టేక్ లో చేసిన శింబు
, సోమవారం, 26 ఏప్రియల్ 2021 (16:54 IST)
Simbu, kalyni
తెలుగులోనూ సుప్రసిద్ధుడైన సూపర్ స్టైలిష్ తమిళ్ స్టార్ శింబు-కల్యాణి ప్రియదర్శన్ జంటగా క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో వి హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత 'సురేష్ కామాచి" 125 కోట్ల భారీ బడ్జెట్తో హిందీ-తమిళ్-తెలుగు-కన్నడ-మలయాళ భాషల్లో నిర్మిస్తున్న బహుభాషా చిత్రం "మానాడు" చిత్రీకరణ చివరి దశలో ఉంది. పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో శింబు ముస్లింగా నటిస్తుండడం గమనార్హం. 
 
ఈ చిత్రంలో ఆరు నిమిషాల నిడివి గల ఓ షాట్ ను సింగిల్ షాట్ లో చేసి శభాష్ అనిపించుకున్నారు శింబు. ఈ షాట్ లో హీరోయిన్ కల్యాణి ప్రియదర్సన్ తోపాటు ఎస్.జె.సూర్య పాల్గొన్నారు. నటుడిగా శింబు సత్తా అందరికీ తెలిసిందే.
 
సుప్రసిద్ధ దర్శకులు భారతీరాజా, ఎస్.ఏ.చంద్రశేఖర్, ఎస్.జె.సూర్య ఈ చిత్రంలో నటిస్తుండడం తెలిసిందే. సంగీత సంచలనం యువన్ శంకర్ రాజా స్వర సారధ్యం వహిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ ఛాయాగ్రహణం: రిచర్డ్ ఎమ్.నాథన్, పోరాటాలు: స్టంట్ శివ, నృత్యాలు: రాజు సుందరం, బ్యానర్: వి హౌస్, నిర్మాత: సురేష్ కామాక్షి, రచన-దర్శకత్వం: వెంకట్ ప్రభు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సుమ కనకాలను ట్రోల్ చేస్తున్న జనం.. కారణం ఏంటో తెలుసా?