Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాలీవుడ్‌లో ప్రయోగం చేయాడానికి సిద్ధంగా ఉన్నాను : ఎస్ఎస్ రాజమౌళి

Webdunia
బుధవారం, 18 జనవరి 2023 (14:39 IST)
ప్రతి ఒక్క దర్శకుడికి హాలీవుడ్ చిత్రం తీయాలన్న కల ఉంటుందని, దీనికి తాను కూడా అతీతుడిని కాదని దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి అన్నారు. అందువల్ల హాలీవుడ్‌లో ప్రయోగం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. 
 
"ఆర్ఆర్ఆర్" చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపుతో పాటు ప్రశంసలు కూడా దక్కుతున్నాయి. ఈ చిత్రంలోని నాటు నాటు పాటకు ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా వరించింది. అలాగే, మరో అంతర్జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. 
 
ఈ క్రమంలో హాలీవుడ్ దర్శక దిగ్గజం, "అవతార్" సృష్టికర్త జేమ్స్ కామెరూన్ సైతం "ఆర్ఆర్ఆర్" చిత్రాన్ని చూసి రాజమౌళిని మెచ్చుకున్నారు. దీంతో రాజమౌళి తదుపరి చిత్రం హాలీవుడ్‌లోనే ఉంటుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
 
ఈ నేపథ్యంలో అమెరికా పర్యటనను దిగ్విజయంగా ముగించుకుని "ఆర్ఆర్ఆర్" టీమ్ స్వదేశానికి చేరుకుంది. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ, "భారత్‌కు తిరిగి చేరుకున్నాను. నేను ఒక డైరెక్టర్‌ను. ఒక సినిమాను ఎలా తీయాలో ఎవరూ నాతో చెప్పరు. బహుశా నా మొదటి అడుగు ముందుగా ఎవరో ఒకరి సహకారం తీసుకోవడం కావచ్చు" అని ఓ వార్తా సంస్థతో ఉన్నారు. ఈ వ్యాఖ్యలు ఆయన హాలీవుడ్ ప్రవేశంపై సంకేతాలు ఇచ్చేవిగా ఉన్నాయని పేర్కొంటున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments