Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూనమ్ పాండే చచ్చిపోయిందంటే చచ్చినా నమ్మలేదంటున్న పూనమ్ భర్త సామ్

ఐవీఆర్
సోమవారం, 5 ఫిబ్రవరి 2024 (20:31 IST)
పూనమ్ పాండే. గర్భాశయ కేన్సర్ పైన అవగాహన కల్పించేందుకని తను చనిపోయినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయించుకున్నది. ఒకరోజంతా ఆ ప్రచారం మీడియాలో జరిగింది. దీనిపై సినీ ప్రపంచంలోని కొంతమంది తారలతో పాటు పూనమ్ అభిమానులు కూడా తీవ్ర ఆందోళన చెందారు.

ఐతే మరుసటిరోజు తను చనిపోలేదంటూ సోషల్ మీడియాలో ఓ వీడియోను వదిలింది పూనమ్. కేవలం గర్భాశయ కేన్సర్ పైన ప్రజల్లో అవగాహన కల్గించేందుకు ఇలాంటి చర్యకు పాల్పడ్డట్లు వివరించింది. ఐతే దీనిపై చాలామంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవగాహన కల్పించేందుకు ఇలాంటి దారిని ఎంచుకోవడం దారుణమని మండిపడుతున్నారు. మరికొందరైతే పూనమ్ పాండేపై కేసు పెట్టేందుకు సిద్ధమయ్యారు.
 
ఇక అసలు విషయానికి వస్తే... పూనమ్ పాండే చనిపోయిందన్న వార్త తెలిసి తనకేమీ బాధ కలగలేదని ఆమె భర్త సామ్ బాంబే అన్నారు. ఆమెతో కనెక్ట్ అయి వున్నవారు ఆమె చెప్పే మాటలు ఎలా వుంటాయో ఇట్టే అర్థమవుతుందని అన్నాడు. నేను ప్రతిరోజూ ఆమె గురించి విపరీతంగా ఆలోచిస్తాననీ, అందువల్ల ఆమె చనిపోయి వుండదని నాకు ఎక్కడో అనిపించిందనీ, బతికే వున్నందుకు సంతోషంగా వుందని చెప్పాడు. పూనమ్ పాండే- సామ్ బాంబేకి 2020లో పెళ్లయ్యింది. ఐతే తనను హింసిస్తున్నాడంటూ భర్తపై గృహ హింస కేసు పెట్టి అతడితో విడిపోయింది పూనమ్ పాండే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీలో నిద్రమాత్రలు కలిపి భార్యకు ఇచ్చి భర్త అత్యాచారం...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,030 మంది టిబి రోగులకు గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ సాయం

కల్నల్ సోఫియా ఖురేషిపై విజయ్ షా కామెంట్స్- ఫైర్ అయిన వైఎస్ షర్మిల

పహల్గామ్ ఉగ్రదాడి: పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం, జీవనోపాధి కోల్పోయిన వేలమంది

గాజాలో వైమానికదాడి.. 22 మంది చిన్నారులతో సహా 48 మంది మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments