Webdunia - Bharat's app for daily news and videos

Install App

'జల్సాలు చూపిస్తూ అజ్ఞాతవాసంలో వేసేస్తాడు జాగ్రత్త.. నమ్మకద్రోహి' : పూనమ్ కౌర్

టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ మరోమారు హాట్‌టాపిక్‌గా మారింది. ఆమె గతంలో నటి శ్రీరెడ్డికి కౌంటర్ ఇచ్చి... హీరో పవన్ కళ్యాణ్‌కు సపోర్టుగా మాట్లాడింది. ఆ సమయంలో పూనమ్ కౌర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయ

Webdunia
శనివారం, 26 మే 2018 (09:07 IST)
టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ మరోమారు హాట్‌టాపిక్‌గా మారింది. ఆమె గతంలో నటి శ్రీరెడ్డికి కౌంటర్ ఇచ్చి... హీరో పవన్ కళ్యాణ్‌కు సపోర్టుగా మాట్లాడింది. ఆ సమయంలో పూనమ్ కౌర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇపుడు ఓ టాలీవుడ్ దర్శకుడుని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించింది. ఇది ఇపుడు ఫిల్మ్ నగర్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.
 
తన ట్విట్టర్ ఖాతాలో పూనమ్ కౌర్ చేసిన ట్వీట్స్‌ను ఓసారిపరిశీలిస్తే, 'జల్సాలు చూపిస్తూ అజ్ఞాతవాసంలో వేసేస్తాడు జాగ్రత్త .. నమ్మకద్రోహి' అంటూ ట్వీట్ చేసింది. ఆ తర్వాత 'ఆ నాలుగు కుటుంబాలకు దగ్గరగా ఉండటం.. ఎన్నారై హీరోయిన్లకు అవకాశాలు ఇవ్వడం ఆ దర్శకుడికి అలవాటు. నాకు హిట్లు లేవనే సాకులు చెప్పి ఆ ఎన్నారై హీరోయిన్‌కు అవకాశం ఇచ్చాడు. మరి ఆ ఎన్నారై హీరోయిన్‌కు హిట్లు ఉన్నాయా? ఆ ఎన్నారై హీరోయిన్లు మీరు చెప్పిన పనులు బాగా చేస్తారని విన్నాను.. అలాంటి ఉద్యోగాలు చేయకపోవడమే మంచిది' అంటూ ఆమె తన ట్వీట్‌లో రాసుకొచ్చింది. 
 
ఇపుడు పూనమ్ చేసిన ట్వీట్ గురించే అంతా చర్చించుకుంటున్నారు. ఆమె చేసిన ఈ ట్వీట్‌లో రెండు సినిమా పేర్లను వాడటంతో ఈ విషయం మరింత వేడెక్కింది. అదేసమయంలో ఆ దర్శకుడు ఎవరనే విషయంలో నెటిజన్లకు ఒక క్లారిటీ వచ్చేసింది. దీంతో ఈ వివాదం ఎక్కడి వరకూ వెళుతుందా అనేదే ఎవరికీ అర్థం కావడం లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డిసెంబరు 17 నుండి 21 వరకు తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి పర్యటన

పురిటి నొప్పులు వచ్చినా గ్రూప్-2 పరీక్షలు రాసింది.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

అత్తగారి ఊరిలో 12 ఇళ్లకు కన్నం వేసిన భలే అల్లుడు!!

దేశ విడిచి పారిపోలేదు.. రష్యా సైన్యం రక్షించింది.. : సిరియా అధ్యక్షుడు అసద్

తాంత్రికుడి మాటలు నమ్మి బతికున్న కోడిపిల్లను మింగేశాడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments