Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయిలను అడ్డంపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు: పూనమ్ కౌర్

ఫ్యాట్సో, బిచ్చగాడి కంటే కత్తి మహేష్‌ పరిస్థితి దారుణమంటూ ట్వీట్ చేసి అప్పట్లో వివాదాన్ని రేకెత్తించిన పూనమ్ కౌర్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఫేస్‌బుక్‌లో ఓ సంచలన పోస్టును పెట్టి మళ్లీ వివాదానికి

Webdunia
శుక్రవారం, 16 మార్చి 2018 (11:03 IST)
ఫ్యాట్సో, బిచ్చగాడి కంటే కత్తి మహేష్‌ పరిస్థితి దారుణమంటూ ట్వీట్ చేసి అప్పట్లో వివాదాన్ని రేకెత్తించిన పూనమ్ కౌర్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఫేస్‌బుక్‌లో ఓ సంచలన పోస్టును పెట్టి మళ్లీ వివాదానికి తెరలేపింది. కాన్సెప్ట్స్ కాపీ చేసి, డైలాగ్స్ కాపీ చేసి.. బట్టలు మార్చినంత ఈజీగా మనుషులను మార్చేస్తూ రాజకీయాలు చేస్తున్నారంటూ.. పూనమ్ చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించినవని నెట్టింట చర్చ మొదలైంది. 
 
కాన్సెప్టులను కాపీకొట్టి.. వేష భాషలు మారుస్తూ జనాల్ని మభ్యపెట్టి అమ్మాయిలని అడ్డంపెట్టుకుంటూ కొంతమంది రాజకీయాలు చేస్తున్నారని.. ఆ భగవంతుడే నిజం ఏంటో తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు. పూనమ్ కౌర్ చేసిన వ్యాఖ్యల్లో ఎక్కడా పవన్ ప్రస్తావన తీసుకురాలేకపోయినా.. ప్రతి మాట పవన్‌ని ఉద్దేశించినవేనని ఆమె తరపు వర్గం, పవన్ వ్యతిరేక వర్గం ప్రచారం మొదలు పెట్టింది.
 
ఇదిలా ఉంటే.. జనసేన ఆవిర్భావ మహాసభలో తన ప్రసంగం ద్వారా రాజకీయ వర్గాల్లో హీట్ పెంచేసిన పవన్ కల్యాణ్‌పై విమర్శల జోరు పెరిగింది. కానీ అధికార టీడీపీ ఇప్పటికే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని ఖండించింది. ప్రస్తుతం పూనమ్ కౌర్ కూడా పవన్ ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేసిందని.. తద్వారా పరోక్షంగా జనసేనానిపై విమర్శలు గుప్పించిందని పవన్ వర్గీయులు గుర్రుగా వున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments