Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఉస్తాద్ భగత్ సింగ్"ని మెచ్చుకున్న పూనమ్ కౌర్.. నిజమేనా?

సెల్వి
బుధవారం, 20 మార్చి 2024 (17:15 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా కమర్షియల్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన "ఉస్తాద్ భగత్ సింగ్" సినిమా నుంచి భగత్ బ్లేజ్ అనే వీడియో మంగళవారం విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా విడుదలైన వీడియో అభిమానులను విపరీతంగా ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై ఆసక్తిని పెంచింది. 
 
పవన్ కళ్యాణ్‌కి ఈసారి ‘గబ్బర్ సింగ్’ని మించిన బ్లాక్ బస్టర్ ఇస్తానని హరీష్ శంకర్ గ్యారెంటీ ఇస్తున్నాడని ఈ వీడియో చూసిన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వీడియోపై వివాదాస్పద నటి పూనమ్ కౌర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
 
ప్రస్తుతం సోషల్ మీడియాలో వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న నటి పూనమ్ కౌర్.. త్రివిక్రమ్‌ని టార్గెట్ చేస్తూ ట్వీట్లు చేస్తూనే ఉంది. అయితే ఈసారి తాజాగా "ఉస్తాద్ భగత్ సింగ్" నుంచి విడుదలైన వీడియోపై పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
 
పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావించకుండా దేవి శ్రీ ప్రసాద్ గురించి ట్వీట్ చేసింది. "గుడ్ వన్ రాక్ స్టార్.. నువ్వు లేకుండా కమర్షియల్ సినిమా అసంపూర్ణం. మరోసారి మీ మ్యూజిక్ విత్ రాక్ కొత్తగా విడుదల చేసిన వీడియోలో సంగీతం బాగుంది"  అంటూ దేవీ శ్రీ ప్రసాద్‌ని మెచ్చుకున్నారు. పూనమ్ కౌర్ చేసిన ఈ ట్వీట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
 
"భగత్ బ్లేజ్" పేరుతో విడుదలైన వీడియోలో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్స్ రాజకీయ వేడిని పెంచుతున్నాయి. ఈ డైలాగులన్నీ పరోక్షంగా పవన్ ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చినట్లుగానే ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

30 రోజులకు మించి ఉంటున్నారా? అయితే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోండి.. అమెరికా

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)

అనకాపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments