Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతి శుక్రవారం జాతకాలు మారిపోతాయ్..

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2022 (14:33 IST)
తెలుగు చిత్రపరిశ్రమలోని క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే. బుట్టబొమ్మగా ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పూజా... ఇపుడు వేదాంత ధోరణిలో మాట్లాడుతున్నారు. చిత్రపరిశ్రమలో లభించే స్టార్డ‌మ్, క్రేజ్, ఇమేజ్ గురించి ఆమె తన అభిప్రాయాన్న నిర్మొహమాటంగా వెల్లడించారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌లలో వరుస అవకాశాలు దక్కించుకుంటూ తన కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. 
 
తాజాగా ఆమె మాట్లాడుతూ.. నా అదృష్టం కొద్దీ సినిమాల్లోకి అడుగుపెట్టాను. ఇక్కడ నా వ్యక్తిగత ప్రతిభతో నిలదొక్కుకున్నాను. హిట్లూ ఫ్లాపులు ఎపుడు తలుపు తడతాయో ఎవరికీ తెలియదు. బాగా అడుతుందనుకున్న చిత్రం బోల్తా కొట్టొచ్చు. అంచనాలు లేని సినిమాలు బాగా ఆడొచ్చు. దేనికైనా సిద్ధంగా ఉండాలి. 
 
ఎంతకష్టపడినా సినిమా హిట్ అయితేనే జనం మనం గురించి మాట్లాడుకుంటారు. ఫ్లాప్ అయితే, అస్సలు పట్టించుకోరు. కనీసం ఆ రోజు స్నేహితుల నుంచి కూడా ఫోన్లు రావు. పరిశ్రమ సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదే సినిమా హిట్ అయిందనుకోండి లెక్కలేనన్ని ఫోన్లు వస్తూనే ఉంటాయి. అందరికీ ఇలానే జరుగుతుంది. నేనేం మినహాయింపు కాదు. హిట్టుకు ఇచ్చే విలువ దేనికీ ఇవ్వరు. ఈ నిజం నాకు తొందరగానే అర్థమైంది. శుక్రవారం ఉదయం ఫోన్ మోగిందంటే నా జాతకం బాగున్నట్టే. లేదంటే శుక్రవారం జాతకం మారిపోయినట్టే అని వివరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మాజీ ప్రేమికుడి వేధింపులు.. ప్రైవేట్ ఫోటోలు లీక్.. పెళ్లి క్యాన్సిల్.. ఎలా జరిగిందంటే?

బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

హెచ్‌సీయూలో ఏప్రిల్ 3 వరకు పనులు ఆపండి.. తెలంగాణ హైకోర్టు ఆదేశం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments