Murali Krishnamraju, Shrutishetty, rasool and others
ఆనంద్, మురళీ కృష్ణంరాజు, శృతిశెట్టి, మెహబూబ్ షేక్ (ఎమ్.ఎస్), రాకేష్ మాస్టర్ ముఖ్య తారాగణంగా పృథ్వి పేరిచర్ల దర్శకత్వంలో "వేలర్ ఎంటర్టైన్మెంట్ స్టూడియోస్"పై నాగిరెడ్డి గుంటక - మురళీ కృష్ణంరాజు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "స్కై". ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం చివరి షెడ్యూల్ జరుపుకుంటోంది. సుప్రసిద్ధ ఎడిటర్ సురేష్ ఆర్స్ ఈ చిత్రానికి పని చేస్తుండడం గమనార్హం.
"ఒక వ్యక్తి అన్నీ కోల్పోయి ఒంటరిగా బ్రతకాల్సి వస్టే, ఏళ్ల తరబడి అనుభవిస్తున్న బాధ, ఆనందంతో తన ఒంటరితనాన్ని జయించాడా, లేదా? లేక ఏకాకి జీవితమే కదా అని రోజు గడవడం కోసం తుంటరిగా పక్కవాడ్ని మోసం చేస్తూ బ్రతికేస్తున్నాడా? అసలు ఒంటరితనం మనిషికి ఏం నేర్పుతుంది? మనిషిని ఎలా మలుస్తుంది? అనేది క్లుప్తంగా "స్కై" చిత్రం కథాంశమని... రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ, సురేష్ ఆర్స్ ఎడిటింగ్ "స్కై" చిత్రానికి మెయిన్ పిల్లర్స్ అని దర్శకుడు పృథ్వి పేరిచర్ల తెలిపారు.
చివరి షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలతోపాటు, ప్యాచ్ వర్క్ కూడా పూర్తి చేయనున్నామని, తెలుగువారంతా గర్వపడే చిత్రంగా "స్కై" చిత్రాన్ని తీర్చిదిద్దేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని నిర్మాతలు నాగిరెడ్డి గుంటక - మురళీ కృష్ణంరాజు తెలిపారు.
పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు సమాంతరంగా జరుపుకుంటున్న ఈ విభిన్న కథా చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్ - అప్పాజీ, పబ్లిసిటీ డిజైనర్: కృష్ణా డిజిటల్స్, మాటలు: మురళీ కృష్ణంరాజు - పృథ్వి పేరిచర్ల, సంగీతం: శివ, ఎడిటర్: సురేష్ అర్స్, సినిమాటోగ్రఫీ: రసూల్ ఎల్లోర్, నిర్మాతలు: నాగిరెడ్డి గుంటక - మురళీ కృష్ణంరాజు, కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: పృథ్వి పేరిచర్ల.