`డియర్ మేఘ`లో సాంగ్ రిలీజ్ చేసిన పూజా హెగ్డే

Webdunia
శుక్రవారం, 16 జులై 2021 (17:36 IST)
Megha Akash, Adit Arun
మేఘా ఆకాష్, ఆదిత్ అరుణ్, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ''డియర్ మేఘ''. 'వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్', బ్యానర్ పై అర్జున్ దాస్యన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.యంగ్ ఫిల్మ్ మేకర్ సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలోని 'ఆమని ఉంటే పక్కన..' అనే లిరికల్ సాంగ్ ను స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే విడుదల చేశారు. శుక్రవారం ఉదయం 10.18 నిమిషాలకు 'ఆమని ఉంటే పక్కన..' లిరికల్ పాట లాంఛ్ చేసిన పూజా హెగ్డే చిత్ర యూనిట్ కు బెస్ట్ విశెస్ తెలిపారు.
 
ఆదిత్ అరుణ్, మేఘా ఆకాష్ ల మీద చిత్రీకరించిన ఈ అందమైన లవ్ సాంగ్ ఎలా ఉందో చూస్తే.... ఆమని ఉంటే పక్కన...ఏమని చెప్పను భావన...పోతే మళ్లీ రాదనా...మళ్లీ మళ్లీ చూడనా..యే వానవిల్లో వేల రంగుల్లో కిందే వాలిందో...ఏ తీపిముల్లో నాటి గుండెల్లో నవ్వై పూసిందో..నీ ఊపిరేమో వెచ్చంగ మెల్లో ఇల్లా తాకిందో...నా ధ్యాస మొత్తం నీ మాయలోకే అల్లా జారిందో.. అడుగు, అడుగు నీతోనే..ఆకాశం అంచుకు వెళుతున్నానే..మలుపు, మలుపు నీతోనే మనసులో నే నీకో గుడి కడుతున్నాలే అంటూ ప్రేమను వర్షిస్తుందీ పాట.
 
హరి గౌర బ్యూటిఫుల్ మ్యూజిక్ కంపోజిషన్ లో లవ్ సాంగ్స్ స్పెషలిస్ట్ కృష్ణకాంత్ రాసిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి పాడారు. ఓ అందమైన, ఆసక్తికరమైన ప్రేమకథగా తెరకెక్కుతున్న ''డియర్ మేఘ'' సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టులో థియేటర్ లల్లో విడుదలకు సిద్ధమవుతోంది.
 
ఈ చిత్రానికి సంగీతం - హరి గౌర, సినిమాటోగ్రాఫర్ - ఐ ఆండ్రూ, ఎడిటర్ - ప్రవీణ్ పూడి, ఆర్ట్ డైరెక్టర్ - కె.వి రమణ, నిర్మాత : అర్జున్ దాస్యన్, రచన,దర్శకత్వం : సుశాంత్ రెడ్డి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రూ.5కే షర్ట్ ఆఫర్ ... దుకాణానికి పోటెత్తిన ప్రజలు

పాక్ వైద్యుడి బాగోతం- ఆపరేషన్ థియేటర్.. సర్జరీని ఆపేసి.. నర్సుతో లైంగిక చర్య.. తర్వాత?

నేను దేశానికి మంత్రిని... వెళ్లి మీ మంత్రికో.. ముఖ్యమంత్రికో చెప్పుకో... : వివాదంలో కేంద్ర మంత్రి సురేశ్ గోపి

సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు ఏపీ దసరా సెలవులు

రూ.50 కోసం స్నేహితుల మధ్య గొడవ .. నచ్చజెప్పడానికి వెళ్ళిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యాలకలు 6 ప్రయోజనాలు, ఏంటవి?

సర్జికల్ రోబోటిక్స్‌లో భారతదేశం యొక్క తదుపరి ముందడుగు: అధునాతన సాఫ్ట్ టిష్యూ రోబోటిక్ సిస్టమ్‌

కొత్తిమీర ఎందుకు వాడాలో తెలుసా?

వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తినాలి? ఏవి తినకూడదు?

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

తర్వాతి కథనం
Show comments