Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసలు మీరు ఎవరు? విడుదల కాని సినిమాను మీరెలా చూశారు..?

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2022 (15:34 IST)
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం పొన్నియన్ సెల్వన్.. ఇక ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సాంగ్, ట్రైలర్‌తో అంచనాలను పెంచేసిన ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. 
 
ఇక ఈ క్రమంలోని పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వకముందే తాను చూసానంటూ ఫస్ట్ రివ్యూ ఇస్తూ ఉంటాడు ఉమైర్ సంధు.. దుబాయ్ ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యుడుగా చెప్పుకునే ఇతడు తాజాగా PS-1 కి సంబంధించి కూడా ఫస్ట్ రివ్యూ అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టాడు.
 
ఇందులో కొన్ని హైలెట్ అయ్యే పాయింట్స్ ఇవేనంటూ రేటింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇకపోతే ఇప్పటివరకు ఎన్నో పాన్ ఇండియన్ సినిమాలకు ఫస్ట్ రివ్యూ అంటూ పోస్ట్ పెట్టే ఇతడికి నటి సుహాసిని మణిరత్నం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
 
ఉమైర్ సందు పొన్నియన్ సెల్వన్ మూవీ గురించి రివ్యూ ఇస్తూ సినిమాలో ప్రొడక్షన్ డిజైనింగ్‌, విఎఫ్‌ఎక్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇందులో చియాన్ విక్రమ్, కార్తీక్ ప్రేక్షకుల మనసులు దోచుకుంటారు.. ఐశ్వర్యరాయ్ ఫామ్‌లోకి వచ్చినట్లు తెలిపాడు. ఇక అంతేకాదు ప్రేక్షకులతో క్లాప్స్ కొట్టించే సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చాడు. 
 
ఇకపోతే ఈ విషయాన్ని తిప్పికొడుతూ మణిరత్నం భార్య నటి సుహాసిని ఉమైర్ సందు రివ్యూ పై స్పందించింది . ఏకంగా నువ్వు ఎవరంటూ ఉమైర్‌ను అడుగుతూ కామెంట్ చేయడం విశేషం. 
 
అంతేకాదు అసలు మీరు ఎవరు? విడుదల కాని సినిమాను మీరు ఎలా చూశారు? అని కామెంట్ చేసింది. దీంతో ఉమైర్ ఫస్ట్ రివ్యూపై సోషల్ మీడియాలో నెటిజన్స్ విరుచుకుపడుతున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments