ప్రముఖ దర్శకుడు మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ సినిమా సెప్టెంబర్ 30, 2022న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. మణిరత్నం దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ నిర్మించాయి. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడంలో తెరకెక్కిన ఈ సినిమా తొలి భాగం 'PS-1' నేడు(సెప్టెంబర్ 30) విడుదలైంది. ఈ చిత్రాన్ని తెలుగులో 'దిల్' రాజు రిలీజ్ చేశారు.
జయం రవి, కార్తీ, ఐశ్వర్యా రాయ్, త్రిష, ఐశ్వర్యా లక్ష్మి, ప్రకాష్‌రాజ్, శరత్‌కుమార్, విక్రమ్ ప్రభు, శోభిత ధూళిపాళ, కీలక పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కింది.
లెజెండరీ ఫిల్మ్ మేకర్ మణిరత్నం నాలుగేళ్ల విరామం తర్వాత చేసిన సినిమా కావడంతో పాటు ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. ఈ సినిమా గురించి ట్విట్టర్ రివ్యూ ఏం చెప్తుందో చూద్దాం..
ఈ చిత్రంలో విజువల్స్ ఎఫెక్ట్స్ , మ్యూజిక్ చాలా బాగున్నాయి. 'అద్భుతమైన విజువల్స్ ఉన్న ఇలాంటి సినిమాను మణిరత్నం కేవలం 155 రోజుల్లో రెండు భాగాలను ఎలా తెరకెక్కించారో ఊహించుకోవడం కష్టమే. అతని డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి ఇది సాధ్యమై ఉండొచ్చు. మణిరత్నం కష్టానికి ఫలితం దక్కిందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
ఫస్టాఫ్ బాగుందని, సెకండాప్ యావరేజ్‌గా ఉందని చెబుతూ 2.5-2.75 రేటింగ్ ఇచ్చాడు ఓ నెటిజన్. విక్రమ్, కార్తి, త్రిషల యాక్టింగ్‌తో పాటు ఏఆర్ రెహ్మాన్ నేపథ్య సంగీతం బాగుందని టాక్ వస్తోంది.
పదో శతాబ్దం అంటే వెయ్యి సంవత్సరాల క్రితం పరిపాలన సాగించిన చోళ రాజ్యపు రాజుల గొప్పతనం గురించి చెప్తూ ఈ కథ మొదలవుతుంది. అప్పటి చోళ రాజ్యంను ఎలాగైనా సామ, దాన, దండోపాయాలతో దక్కించుకునేందుకు చాలామంది ప్రయత్నిస్తూంటారు. ఈ ప్రయత్నాన్ని తిప్పికొట్టడం ఆదిత్య కరికాలుడు(విక్రమ్)కు ఓ సవాల్ గా మారుతుంది.
ఇంకా రాజ్య ఆక్రమణ ఎలా అడ్డుకున్నారు అనేది ప్రధాన కథ. ఇందులో కుందవాయి (త్రిష), నందిని (ఐశ్వర్య రాయ్) పాత్రలు కీలకమైనవి. చిరంజీవి వాయస్ ఓవర్‌తో మొదలయ్యే ఈ చిత్రం చారిత్రక సంఘటనలతో ముడిపడింది. ఈ చిత్రం కథకు మూలం పొన్నియిన్ సెల్వన్ అనే తమిళనాడులో పాపులరైన ఒక చారిత్రక నవల. దీన్ని కృష్ణమూర్తి (1899-1954) రాశారు.
తెరపై కనిపించే నటులంతా ఆల్రెడీ నటనకు పేరు తెచ్చిన వారే. ముఖ్యంగా విక్రమ్, త్రిష, ఐశ్వర్యరాయ్ వంటి వారు గురించి చెప్పేదేముంది. అందూలోనూ మణిరత్నం వంటి దర్శకుడు చేతిలో పడ్డాక ఆ మాణిక్యాలు మరింత మెరుగు దిద్దుకుంటాయి. అదే జరిగింది.
చోళ రాజు ఆదిత్య కరికాలుడు పాత్రలో విక్రమ్ నటన అయితే మామూలుగా ఉండదు. ఒక గొప్ప యోధుడిగా మనకు గుర్తుండిపోతాడు. త్రిష, వయస్సు పెరుగుతున్నా చెక్కు చెదరని అందం. నందినిగా చేసిన ఐశ్వర్య లుక్‌తోనే అభిమానులను ఆకట్టుకుంది. కార్తి కేక పెట్టించాడు. జయం రవి ఓకే అనిపిస్తాడు. ప్రకాష్ రాజ్ ఏ పాత్ర చేసినా పాదరసంగా మారిపోయాడు.
విక్రమం, ఐశ్వర్య వంటి భారీ స్టార్ కాస్ట్, కథను కథలా చెప్పే మణిరత్నం తీరు బాగుంది. తెలుగువారికి పరిచయం లేని కథ కావడం.. పొన్నియన్ సెల్వన్.. తెలుగు ప్రేక్షకులకు ఏమేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.