Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పొన్నియిన్ సెల్వన్' నయా రికార్డులు ... రూ.200 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ!

Webdunia
సోమవారం, 3 అక్టోబరు 2022 (10:37 IST)
స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన "పొన్నియిన్ సెల్వన్" చిత్రం సరికొత్త రికార్డులను నెలకొల్పుతుంది. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మూడు రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది. తమిళంలో ఈ చిత్రానికి సూపర్ హిట్ టాక్ రాగా, తెలుగు, హిందీ, కన్నడం, మలయాళ భాషల్లో మాత్రం మిశ్రమ స్పందన వచ్చింది. అయినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. మూడు రోజులు పూర్తయ్యే సరికి ఈ చిత్రం రూ.230 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టినట్టు కోలీవుడ్ మూవీ ట్రేడ్ వర్గాల వర్గాల సమాచారం. 
 
ప్రముఖ తమిళ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన 'పొన్నియన్‌ సెల్వన్‌' నవల ఆధారంగా మణిరత్నం ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. దశాబ్దకాలం క్రితమే మణిరత్నం ఈ చిత్రాన్ని మొదలు పెట్టారు. కానీ, పలు కారణాలతో షూటింగ్‌ ఫస్ట్‌ షెడ్యూల్‌కే ఆగిపోయింది. ఇక దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత మళ్ళీ ఈ సినిమా కార్యరూపం దాల్చింది.
 
ఇందులో చియాన్ విక్ర‌మ్‌, కార్తీ, జయం రవి, ఐశ్వ‌ర్య‌రాయ్‌, త్రిష, బాబీ సింహా, శరత్ కుమార్, పార్తీబన్, ప్రకాష్ రాజ్, ప్రభు, విక్రమ్ ప్రభు, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ్ళ వంటి వారు నటించారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతం సమకూర్చగా, రవి వర్మన్ ఛాయాగ్రహం అందించారు. 
 
ఈ చిత్రం విడుదలకు ముందే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు క్రియేట్‌ అయ్యాయి. అంతేకాకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం అంతే భారీ స్థాయిలో ఓపెనింగ్స్‌ రాబట్టింది. మొదటి రోజే ఈ చిత్రం రూ.80 కోట్ల వరకు కలెక్షన్‌లు సాధించి ఔరా అనిపించింది. కాగా ఈ చిత్రం తాజాగా రూ.200 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టింది. తమిళ సినీ చరిత్రలోనే అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన సినిమాగా "పొన్నియన్‌ సెల్వన్‌" నిలిచింది. ఈ ఫీట్‌ను కేవలం మూడు రోజుల్లోనే ఈ చిత్రం సాధించడం విశేషం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాలకు ఆలస్యంగా వచ్చారని.. 18మంది విద్యార్థినులకు హెయిర్ కట్ (video)

దుఃఖ సమయంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు : నారా రోహిత్

మంగళగిరిలో లేడీ అగోరి హల్చల్‌- పవన్ కళ్యాణ్‌ను కలిసేందుకు రోడ్డుపైనే..? (Video)

టీ అడిగితే లేదంటావా.. బేకరీలో మందుబాబుల ఓవరాక్షన్.. పిచ్చకొట్టుడు.. (video)

పెళ్లి కుమారుడు కోసం రైలును ఆపేశారు... రైల్వే మంత్రి థ్యాంక్స్ చెప్పిన వరుడి ఫ్యామిలీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

తర్వాతి కథనం
Show comments