Webdunia - Bharat's app for daily news and videos

Install App

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐశ్వర్య రాయ్‌ని చూస్తే అసూయగా వుంది : మీనా

meena
ఆదివారం, 2 అక్టోబరు 2022 (14:05 IST)
బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్ బచ్చన్‌ను చూస్తే తనకు అసూయగా ఉందని సినీ నటి అన్నారు. బాలనటిగా గుర్తింపు తెచ్చుకొని ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్న మీన... ఇప్పటివరకు దాదాపు 90కిపైగా చిత్రాల్లో నటించారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అగ్రహీరోలందరితోనూ నటించి మెప్పించారు. 
 
తాజాగా మీనా చేసిన ఓ సరదా ట్వీట్‌ అందరినీ ఆకర్షిస్తోంది. పొన్నియిన్‌ సెల్వన్‌ సినిమాలో ఐశ్వర్యరాయ్‌ పాత్రను ఉద్దేశించి ఆమె ట్వీట్‌ చేశారు. 'నా డ్రీమ్‌ క్యారెక్టర్‌ నందిని (పొన్నియిన్‌ సెల్వన్‌లో ఐశ్వర్య రాయ్‌ పాత్ర) పాత్ర పోషించిన ఐశ్వర్య రాయ్‌ని చూస్తే అసూయగా ఉంది. నా జీవితంలో మొదటిసారి నేను అసూయపడుతున్నాను. పొన్నియిన్‌ సెల్వన్‌లో నటించిన అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నా' అంటూ నవ్వుతున్న ఎమోజీలను జత చేశారు.
 
ఇక విక్రమ్‌, ఐశ్వర్యరాయ్‌, త్రిష, కార్తి, జయం రవి, ప్రకాశ్‌ రాజ్‌ లాంటి భారీ తారాగణంతో మణిరత్నం రూపొందించిన 'పొన్నియిన్‌ సెల్వన్‌' చిత్రం సెప్టెంబర్‌ 30న విడుదలై మంచి ప్రేక్షకాదరణ పొందుతోంది. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా మాజీ బాయ్‌ఫ్రెండ్.. నాకూ ఇప్పుడూ ఫ్రెండే.. లైగర్ నచ్చాడు.. రష్మిక