Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుట్టిన‌రోజు వేడుక‌పై పోలీసు కేసు!

Webdunia
శనివారం, 10 ఏప్రియల్ 2021 (15:46 IST)
Allu arjun with fans
పుష్ప‌ సినిమా టీజ‌ర్ వేడుక‌లో ద‌ర్శ‌కుడు సుకుమార్ స్ట‌యిలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్‌గా బిరుదు ఇచ్చేస‌రికి ఫ్యాన్స్ ఆనందంలో వున్నారు. అదే ఆనందాన్ని త‌న పుట్టిన‌రోజును వినూత్నంగా జ‌రుపుకోవాల‌ని అల్లు అర్జున్ టీమ్ భావించింది. అందుకే 8వ తేదీ రాత్రి 8.30నిముషాల‌కు హైద‌రాబాద్‌లోని మాదాపూర్‌ద‌గ్గ‌ర కొత్త‌గా క‌ట్టిన తీగ‌ల వంతెన‌పై వేడుక జ‌ర‌పుకున్నారు. అక్క‌డ వినూత్నంగా కేక్ క‌ట్ చేసి జ‌రుపుకోవ‌డ‌మేకాకుండా బాణ‌సంచా కాల్చారు. అక్క‌డ లేజ‌ర్ షో విశేషంగా ఆక‌ట్టుకుంది. ఈ వేడుక‌కు పోలీసు బందోబ‌స్తు కూడా ఏర్పాటు చేయ‌బ‌డింది. మీడియా కూడా భారీగానే త‌న‌లివ‌చ్చారు.

ఏదో కొద్దిసేపు వుంటుంద‌నుకున్న ఈ వేడుక దాదాపు గంట‌ప‌ట్టింది. ఈలోగా ట్రాఫిక్‌ను బిడ్జ్రి కింద‌నుంచి ఇన్ ఆర్‌బిట్ మాల్‌కు మ‌ళ్ళించారు. కాగా, ఈ బాణాసంచాను కాల్చిన ఆయ‌న అభిమానులపై కోవిడ్ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా పేల్చారంటూ వీరిపై కేసు న‌మోదైంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ప్రశాంత్‌తో పాటు మరో అభిమాని సంతోష్ పేరుతో ఫైర్ క్రాకర్స్‌ని ఈ వేడుకలో కాల్చారు. జూబ్లీ హిల్స్ పోలీసులు  ప్రశాంత్‌, సంతోష్‌పై కేసు నమోదు చేశారు. పబ్లిక్ కి అంత‌రాయం క‌లిగించారు కాబ‌ట్టి వీరిపై ఐపిసి 290, ఐపిసి 336 మరియు ఐపిసి 188 సెక్ష‌న్‌ల కింద‌ కేసు న‌మోదు చేశారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధాని ప్రసంగిస్తుండగానే కాల్పులకు తెగబడిన పాకిస్థాన్ సైన్యం!

మురళీ నాయక్‌కు పవన్, మంత్రుల నివాళి.. ఫ్యామిలీకి రూ.50 లక్షల ఆర్థిక సాయం (Video)

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తా : డోనాల్డ్ ట్రంప్

భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీనరసింహస్వామి గిరిప్రదక్షిణ

ఛత్తీస్‌గడ్ టెన్త్ ఫలితాలు - టాప్ ర్యాంకర్‌కు బ్లడ్ కేన్సర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments