Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో నాగార్జున సోదరి నాగసుశీలపై కేసు నమోదు

Webdunia
సోమవారం, 18 సెప్టెంబరు 2023 (16:59 IST)
హీరో అక్కినేని నాగార్జున సోదరి నాగసుశీలపై హైదరాబాద్ మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. శ్రీజ ప్రకృతి ధర్మ పీఠం ఆశ్రమంపై నాగసుశీలతో పాటు మరికొందరు కలిసి దాడి చేశారంటూ చింతలపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో నాగసుశీలతో పాటు శ్రీనివాస్‌లు సంయుక్తంగా పలు చిత్రాలు నిర్మించడంతో వ్యాపార భాగస్వామిగా కూడా ఉన్నారు. ఈ క్రమంలో వారిమధ్య భూవివాదం కూడా ఉంది. 
 
ఈ క్రమంలో శ్రీనాగ్ ప్రొడక్షన్ మేనేజింగ్ పార్టనర్ చింతలపూడి శ్రీనివాస్, నాగసుశీల మధ్య కొన్నేళ్లుగా భూవివాదాలు ఉన్నాయి. ఇద్దరు కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. అయితే, తనకు తెలియకుండానే శ్రీనివాస్ తన భూములను విక్రయించాడని గతంలో పోలీసులకు నాగసుశీల ఫిర్యాదు చేశారు.
 
మరోవైపు, తనను జైలుపాలు చేసైనా తన చేత కంపెనీ ఆస్తులు రాయించుకోవడానికి తనపై నాగసుశీల కేసు పెట్టారని శ్రీనివాస్ ఆరోపించారు. నాగసుశీల తనయుడు సుశాంత్‌తో నాలుగు సినిమాలు తీసి భారీగా నష్టపోయామన్నారు. ఈ వివాదాల నేపథ్యంలో నాగసుశీలపై శ్రీనివాస్ తాజాగా ఫిర్యాదు చేయడంతో మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments