Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్లాస్మా దానం చేస్తే ప్రాణానికి హానికరమా? చిరంజీవి ఏమన్నారు?

Webdunia
శుక్రవారం, 7 ఆగస్టు 2020 (17:48 IST)
ప్రస్తుతం కరోనా వైరస్ బారినపడివారికి నిజమైన సంజీవనిలా కనిపించేది ఒక్క ప్లామ్మా మాత్రమే. కోవిడ్ బారినపడి కోలుకున్న వారి నుంచి దీన్ని సేకరిస్తారు. ఒక వ్యక్తి దానం చేసే ప్లాస్మాతో 30 మంది కరోనా రోగులకు చికిత్స చేయవచ్చు. వీరంతా 99 శాతం బతికే అవకాశాలు ఉన్నాయి. అందుకే కరోనా వైరస్ బారినపడి కోలుకున్న వారందరూ ప్లాస్మా దానం చేయాలంటూ సెలెబ్రిటీలు, ప్రభుత్వాలు పదేపదే కోరుతున్నాయి. అయితే, ప్లాస్మా దానం చేయడం వల్ల ప్రాణానికి ప్రమాదం కలుగుతుందనే అపోహా చాలా మందిలోవుంది. దీనికి మెగాస్టార్ చిరంజీవి బదులిచ్చారు. 
 
క‌రోనా బాధితుల‌కు ప్లాస్మా ఇస్తే 99 శాంత బ‌తికే అవకాశం ఉంది. ప్లాస్మాలో ఉండే యాంటీ బాడీల వ‌ల్ల క‌రోనా నుంచి కోలుకుంటారు. ఒక‌రి ప్లాస్మా నుంచి 30 మందికి సాయం చేయొచ్చ‌ు. ప్లాస్మా దానం వ‌ల్ల ర‌క్తం న‌ష్ట‌మ‌నేది ఉండ‌ద‌ని, ప్లాస్మా త‌గ్గినా 24 నుంచి 48 గంటల్లో మ‌ళ్లీ త‌యార‌వుతుంది. క‌రోనా నుంచి కోలుకున్నవారు ధైర్యంగా ప్లాస్మా దానం చేయాల‌ని, అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉంటే క‌రోనాను ఎదుర్కోవ‌చ్చ‌ని ఆయన సూచించారు. 
 
కాగా, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ప్లాస్మా డోనర్లకు సన్మాన కార్యక్రమం జరిగింది. దీనికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా 150 మంది ప్లాస్మా డోన‌ర్ల‌ను చిరంజీవి, సీపీ సజ్జ‌నార్‌తో క‌లిసి స‌న్మానించారు. క‌రోనాలాంటి విప‌త్క‌ర పరిస్థితుల్లో ప్లాస్మా అనేది సంజీవ‌నిలా ప‌నిచేస్తుంద‌ని చిరంజీవి అన్నారు. ప్లాస్మా దాత‌ల‌కు చిరంజీవి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. 
 
క‌రోనా పాజిటివ్ వ‌చ్చి కోలుకున్న వారు ముందుకొచ్చి ప్లాస్మా దానం చేయాల‌ని కోరారు, ప్లాస్మాదానంతో చాలా మంది ప్రాణాలు కాపాడినవాళ్ల‌మవుతామ‌ని అన్నారు .రక్త‌దానం చేసేలా అభిమానుల‌ను ప్రోత్స‌హించాను. ఈ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతంగా కొన‌సాగుతుంది. ప్ర‌భుత్వాలు, ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న స‌హ‌కారంతో చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్ సేవ‌లు కొన‌సాగుతున్నాయ‌ని.. బ్ల‌డ్ బ్యాంక్‌కు అవార్డు రావ‌డం చాలా సంతోషంగా ఉంద‌న్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ముందుండి పోరాడుతున్న పోలీసులు, డాక్ట‌ర్లు, పారిశుద్ధ్య సిబ్బందికి ధ‌న్యవాదాలు తెలియ‌జేస్తున్నాన్నారు. ప్లాస్మాదానం చేసిన వారిని స‌త్క‌రించ‌డం సంతోషంగాఉంద‌ని సీపీ సజ్జ‌నార్ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ రాష్ట్రానికి శుభవార్త చెప్పిన కేంద్రం.. ఏంటది?

ట్రాఫిక్ పోలీస్ కూతురిని ఎత్తుకుని ముద్దాడిన బాలయ్య (video)

ఏపీఎస్ఆర్టీ ఏసీ బస్సుల్లో 20 శాతం రాయితీ

వివాహేతర సంబంధం: పెళ్లయ్యాక మరొక వ్యక్తితో ఇష్టపూర్వక శృంగారం తప్పు కాదు కానీ...

కేరళ తిరూర్.. ఎలక్ట్రిక్ వాహనంలో మంటలు.. టూవీలర్‌పై జర్నీ చేసిన వారికి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments