Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెకానిక్ రాకీ నుంచి విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరిల పెప్పీ సాంగ్

డీవీ
బుధవారం, 18 సెప్టెంబరు 2024 (14:53 IST)
Vishwak Sen, Meenakshi
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హైలీ యాంటిసిపేటెడ్ మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్ 'మెకానిక్ రాకీ'తో రాబోతున్నారు. రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ తాళ్లూరి  SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిర్మిస్తున్నారు. ఫస్ట్ లుక్, ఫస్ట్ గేర్, ఫస్ట్ సింగిల్ ఇలా ప్రతి ప్రమోషనల్ మెటీరియల్‌కు  ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మ్యూజికల్ ప్రమోషన్లలో భాగంగా మేకర్స్ సెకండ్ సింగిల్- ఓ పిల్ల సాంగ్ ని రిలీజ్ చేశారు.
 
ఓ పిల్లా పెప్పీ బీట్స్ తో ఇన్స్టంట్ గా లవ్ లో  పడే బ్యూటిఫుల్ నంబర్. ఇటీవలే సరిపోదా శనివారం కోసం బ్లాక్‌బస్టర్ ఆల్బమ్‌ని అందించిన జేక్స్ బెజోయ్ మెకానిక్ రాకీలోని సాంగ్ సిట్యువేషన్ కి పర్ఫెక్ట్ నెంబర్ అందించారు. ఈ పాట రాకీ, ప్రియగా కనిపించిన లీడ్ యాక్టర్స్ లవ్ స్టోరీని అద్భుతంగా ప్రజెంట్ చేసింది.
 
బి-టెక్ సమయంలో తన ప్రేమను తన అమ్మాయికి ప్రపోజ్ చేసే ఛాన్స్ మిస్ చేసుకున్న హీరో  మళ్లీ ఆమెతో కలిసే అవకాశం రావడంతో ఆనందపడతాడు. కృష్ణ చైతన్య రాసిన లిరిక్స్ హీరో లవ్ పై వున్న ఫీలింగ్స్ ని ప్రజెంట్స్ చేస్తోంది. నకాష్ అజీజ్ ఈ పాటను అద్భుతంగా పాడారు. ఈ పాటలో విశ్వక్ సేన్,  మీనాక్షి  బ్యూటీఫుల్ గా కనిపించారు. విజువల్స్ ప్లజెంట్ గా వున్నాయి.
 
శ్రద్ధా శ్రీనాథ్ మరో  హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ చిత్రానికి మనోజ్ కటసాని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అన్వర్ అలీ ఎడిటర్, క్రాంతి ప్రియం ప్రొడక్షన్ డిజైనర్. సత్యం రాజేష్, విద్యాసాగర్ జె ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్.
మెకానిక్ రాకీ అక్టోబర్ 31న దీపావళికి విడుదల కానుంది.
 
తారాగణం: విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్, నరేష్, వైవా హర్ష, హర్షవర్ధన్, రోడీస్ రఘు రామ్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Sunita Williams: అంతరిక్షంలోకి అడుగుపెట్టిన సునీతా విలియమ్స్

cock fight: 10 నిమిషాల్లో యజమానికి కోటి రూపాయలు తెచ్చిన కోడిపుంజు

sankranti cock fight: మౌనంగా నిలబడి గెలిచిన కోడిపుంజు

కాంగ్రెస్ పార్టీలో చేరనున్న ఈటల రాజేందర్ (Video)

మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ : 11 మంది ఎన్‌కౌంటర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

శిశువు గుండె భాగంలోకి వెళ్లిపోయిన లివర్, కిడ్నీలు, పేగులు: ప్రాణాల‌ను కాపాడిన లిటిల్ స్టార్- షీ ఉమెన్- చిల్డ్రన్ హాస్పిటల్‌

కిడ్నీలను డ్యామేజ్ చేసే అలవాట్లు, ఏంటవి?

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

సర్వరోగ నివారిణి తులసి రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments