కరుణాద చక్రవర్తి నిమ్మశివన్న కి పెద్ది చిత్ర బృందం అభినందనలు

దేవీ
శుక్రవారం, 30 మే 2025 (18:20 IST)
Karunada Chakravarthy Nimmasivanna
కన్నడ స్టార్ కరుణాద చక్రవర్తి  నిమ్మశివన్న కి పెద్ది చిత్ర బృందం అభినందనలు తెలిపింది. నేటితో ఆయన సినిమాల్లో 40 అద్భుతమైన సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమాలో శివన్న పాల్గొన్నారు. పెద్దిలో చాలా ప్రత్యేకమైన పాత్రను పోషిస్తున్నాడు, అది అతని ప్రముఖ కెరీర్‌లో చిరస్మరణీయమైనది.
 
రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమాను బుచ్చి బాబు సన దర్శకత్వం వహిస్తున్నారు. మార్చి 27, 2026 న విడుదల కానుంది. ఇటీవలే ఈ సినిమాలోని ఫస్ట్ షాట్ గ్లిమ్స్ కూడా విడుదలైంది, ఇది చాలా పాజిటివ్ స్పందన వచ్చింది. ఈ సినిమా ఒక గ్రామీణ క్రీడా యాక్షన్ డ్రామాగా ఉండబోతోంది. రామ్ చరణ్ ఇందులో చాలా రగ్గుడ్ లుక్ లో కనిపించనున్నారు.
 
పెద్ది సినిమా క‌థ కేవ‌లం క్రికెట్ గురించి మాత్ర‌మే కాద‌ని, విజ‌యన‌గ‌రం బ్యాక్ డ్రాప్ లో ఉత్త‌రాంధ్ర క‌ల్చ‌ర్, మాండ‌లికంలో పాతుకుపోయిన ఓ క‌థ అని తెలిసింది. కథను విన్నవెంటనే చరణ్ అంగీకరించాడు. పెద్ది సినిమాతో మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఏఆర్ రెహ‌మాన్ మంచి  బాణీలు ఇస్తున్నారు. జాన్వీ క‌పూర్ నాయికగా నటిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నీ కోసం నా భార్యను చంపాను.. ప్రియురాలికి మెసేజ్ పంపిన డాక్టర్ భర్త

వదిన పెళ్లి కోసం వుంచిన రూ.50 లక్షల విలువైన ఆభరణాలు దొంగలించిన మహిళ

Prakash Raj: మమ్ముట్టిలాంటి గొప్ప నటుడికి అలాంటి అవార్డులు అవసరం లేదు.. ప్రకాశ్ రాజ్

కరూర్ తొక్కిసలాట తర్వాత బుద్ధి వచ్చిందా.. తొండర్ అని పేరిట వాలంటీర్ల విభాగం

కొత్త అలెర్ట్: ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments