Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను ఓవరాక్షన్ చేయలేదు.. ట్రోల్ చేయడం బాధేసింది.. పాయల్

Webdunia
మంగళవారం, 29 సెప్టెంబరు 2020 (12:25 IST)
పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్ని సినిమాలే చేసినా.. గ్లామర్ పంట పండించడంతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆర్ఎక్స్ 100 చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన పాయల్ రాజ్‌పుత్.. కరోనా వలన కొద్దికాలంగా ఇంటికే పరిమితమైంది. 
 
ప్రస్తుతం షూటింగ్స్ తిరిగి షూటింగ్స్‌లో పాల్గొంటుంది. అయితే సెట్స్‌లోకి అడుగుపెట్టే ముందు పాయల్ కరోనా పరీక్షలు జరిపించుకోగా అందులో నెగెటివ్ అని తేలింది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ టెస్ట్ చేసే సమయంలో తీసిన వీడియోని షేర్ చేసింది.
 
టెస్ట్ చేసే సమయంలో పాయల్ చాలా భయపడింది. ఇది అంత పెద్ద విషయం ఏమి కాదు, ఓవరాక్షన్ చేయాల్సిన అవసరం లేదనకుంటా అని పాయల్‌ను ట్రోల్ చేశారు. దీనిపై స్పందించి పాయల్ రాజ్‌పుత్.. నాకు ఇంజక్షన్స్‌, మందులు అన్నా చాలా భయం. కరోనా టెస్ట్ సమయంలోను చాలా భయపడ్డాను, కాస్త అసౌకర్యానికి గురయ్యాను. దీనిపై నన్ను ట్రోల్ చేయడం చాలా బాధగా అనిపించిందని పాయల్ తెలిపింది. 
 
పాయల్ రాజ్‌పుత్ చివరిసారిగా 2020 జనవరి 24 న విడుదలైన డిస్కో రాజాలో కనిపించింది. ఆమె ఏంజెల్ పేరుతో ఒక తమిళ చిత్రం, నరేంద్ర అనే తెలుగు చిత్రంపై పాయల్ సైన్ చేసింది. పాయల్ రాజ్‌పుత్ ఇటీవల ముంబై నుంచి బేస్‌ను హైదరాబాద్‌కు మార్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తీర్పు ఇచ్చేవరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దు : హైకోర్టు

అన్నా వర్శిటీలో విద్యార్థినిపై అత్యాచారం... మదురై నుంచి చెన్నైకు బీజేపీ ర్యాలీ

Kodali Nani : అసోంలో కొడాలి నాని కీలక సహచరుడు కాళి అరెస్ట్

Chandrababu: పింఛన్ లబ్ధిదారుడి ఇంట కాఫీ తాగిన చంద్రబాబు (video)

ఏడుకొండలు ఇంటిలో కాఫీ తయారు చేసిన సీఎం చంద్రబాబు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

steps to control diabetes మధుమేహం అదుపుకి జాగ్రత్తలు ఇవే

తర్వాతి కథనం
Show comments