Webdunia - Bharat's app for daily news and videos

Install App

రవితేజ సరసన పాయల్ రాజ్‌పుత్.. గ్లామర్ ఆరబోస్తుందా?

Webdunia
శుక్రవారం, 2 నవంబరు 2018 (12:07 IST)
ఆర్‌ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ తన తొలి సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత ఆచితూచి సినిమాలను ఎంచుకుంటున్న పాయల్.. తాజాగా కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వి.ఐ.ఆనంద్‌ దర్శకత్వంలో రవితేజ నటించనున్న ఓ చిత్రంలో ఈ బ్యూటీ ఒక హీరోయిన్‌గా ఎంపికైంది.
 
ముగ్గురు హీరోయిన్లకు ప్రాధాన్యం ఉన్న ఈ చిత్రంలో నన్ను దోచుకుందువటే ఫేమ్‌ సభా నటేష్‌ను మరొక హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ఈ చిత్రం డిసెంబర్‌ నుంచి సెట్స్‌ పైకి వెళ్లనుంది. రవితేజ డ్యూయల్‌ రోల్‌లో నటించనున్న ఈ చిత్రంలో సునీల్‌ ఓ ముఖ్య పాత్రలో నటించనున్నారు.
 
మరోవైపు అమర్ అక్బర్ ఆంథోనీ సినిమాలో రవితేజ నటిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే విడుదలైన సంగతి తెలిసిందే. మాస్ మహారాజ రవితేజ, ఇలియానా జంటగా తెరకెక్కుతోన్న 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్కూలు బ్యాగు తగిలించుకుని కుర్చీలో కూర్చున్నఫళంగా గుండెపోటుతో 8 ఏళ్ల చిన్నారి మృతి (Video)

సారీ చెబితే తిరుపతి తొక్కిసలాటలో చనిపోయినవారు తిరిగొస్తారా? (video)

చెవిరెడ్డికి షాకిచ్చిన ఏపీ హైకోర్టు.. పోక్సో కేసు కొట్టివేతకు నిరాకరణ!

వెంటబడి కుక్కను తోలినట్లు సింహాన్ని తోలాడు, ఏం గుండెరా అతనిది (Video)

త్వ‌ర‌లో వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌ : ఏపీ సీఎస్ విజయానంద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments