Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్‌ కళ్యాణ్‌, ఎస్‌.జె. సూర్య చిత్రం... జుట్టు కత్తిరించి వెరైటీగా పవన్...

చిత్రసీమలో సెంటిమెంట్లు ఎక్కువ. ముహూర్తాలంటూ, అచ్చొచ్చిన రోజులంటూ తెగ హడావుడి చేస్తుంటారు సినీ జనాలు. హీరోలు కూడా ఆ సెంటిమెంట్లని గట్టిగానే నమ్ముతుంటారు. ఇక దర్శకనిర్మాతలైతే సరేసరి. ఖుషీ కాంబినేషన్‌లో పవన్‌ కళ్యాణ్‌, ఎస్‌.జె. సూర్య చిత్రం బుధవారంనాడు

Webdunia
బుధవారం, 27 ఏప్రియల్ 2016 (19:42 IST)
చిత్రసీమలో సెంటిమెంట్లు ఎక్కువ. ముహూర్తాలంటూ, అచ్చొచ్చిన రోజులంటూ తెగ హడావుడి చేస్తుంటారు సినీ జనాలు. హీరోలు కూడా ఆ సెంటిమెంట్లని గట్టిగానే నమ్ముతుంటారు. ఇక దర్శకనిర్మాతలైతే సరేసరి. ఖుషీ కాంబినేషన్‌లో పవన్‌ కళ్యాణ్‌, ఎస్‌.జె. సూర్య చిత్రం బుధవారంనాడు ప్రారంభమైంది. ఖుషి, పులి చిత్రాల తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న చిత్రమిది. పదిహేనేళ్ళ క్రితం ఇదే రోజు ఖుషి సినిమా విడుదలైంది. ప్రేమకథలో కొత్త శకానికి నాంది పలికింది.
 
కాగా, సర్దార్‌గబ్బర్‌సింగ్‌ నిర్మాతల్లో ఒకరైన శరత్‌మరార్‌ ఈ చిత్రాన్ని నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బేనర్‌లో నిర్మిస్తున్నారు.  ఫ్యాక్షన్‌ లీడర్‌ ప్రేమ కథ ఇది. ఈ కథను సూర్యతో కలిసి రచయిత ఆకుల శివ గత నాలుగు నెలలుగా పనిచేస్తున్నారు. ప్రతి విషయాన్ని పవన్‌తో పంచుకుంటున్నారు. అనూప్‌ రూబెన్స్‌ బాణీలు సమకూరుస్తున్నారు. 
 
ఇప్పటికే రెండు బాణీలు పూర్తయ్యాయి. బిల్లా, బెంగాల్‌ టైగర్‌ చిత్రాలకు పనిచేసిన సినిమాటోగ్రాఫర్‌ సుందర్‌ రాజన్‌ దీనికి పనిచేస్తున్నారు. బ్రహ్మకడలి ఆర్ట్‌, గౌతంరాజు ఎడిటింగ్‌కు పనిచేస్తుండగా రామ్‌లక్ష్మణ్‌లు పోరాటాలను చేస్తున్నారు. బుధవారంనాడు సంస్థ కార్యాలయంలో ముహూర్తం గావించారు. ప్రముఖ నిర్మాత సుధాకర్‌రెడ్డి క్లాప్‌ కొట్టగా, గౌతంరాజు స్విచ్చాన్‌ చేశారు. సూర్య గౌరవ దర్శకత్వం వహించారు. ప్రీ ప్రొడక్షన్‌ పనులు ముగింపు దశలో ఉన్న ఈ చిత్రం రెగ్యులర్‌ చిత్రీకరణ జూన్‌లో మొదలవుతుందని శరద్‌మరార్‌ తెలియజేస్తున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments