Webdunia - Bharat's app for daily news and videos

Install App

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

ఠాగూర్
బుధవారం, 4 జూన్ 2025 (15:56 IST)
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోమారు తన పెద్ద మనసును చాటుకున్నారు. "హరిహర వీరమల్లు" చిత్ర నిర్మాత ఏఎం రత్నంను ఆదుకునేందుకు ఆయన ముందుకు వచ్చారు. ఈ చిత్రం కోసం తాను తీసుకున్న అడ్వాన్స్ సొమ్ము మొత్తాన్ని తిరికి ఇచ్చేసేందుకు సిద్ధపడ్డారు. నిర్మాతపై ఆర్థిక భారం పడరాదని, నిర్మాత శ్రేయస్సు కోరి ఈ నిర్ణయం తీసుకున్నారు. 
 
వాస్తివానికి ఈ చిత్రం గత 2020లో అధికారికంగా ప్రకటించారు. అపుడు క్రిష్ జాగర్లమూడి దర్శకుడు. కొంత భాగం చిత్రీకరణ పూర్తయిన తర్వాత పవన్ రాజకీయాల్లో క్రియాశీలకమైపోయారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన పార్టీ ఘన విజయం సాధించి, ఆయన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. పైగా, సినిమా షూటింగ్ కోసం పూర్తి సమయాన్ని కేటాయించలేకపోయారు. ఈ క్రమంలో సినిమా పూర్తి చేసే బాధ్యతను ఏఎం రత్న తనయుడు జ్యోతికృష్ణ తీసుకుని, మిగిలిన భాగం షూటింగును పూర్తి చేశారు. 
 
సినిమా ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు సుధీర్ఘకాలం సెట్స్‌పైనే ఉండటం వల్ల నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోయింది. ఇది నిర్మాత ఏఎం రత్నంపై అదనపు భారాన్ని మోపింది. ఈ పరిస్థితులన్నీ గ్రహించిన పవన్ కళ్యాణ్... ఈ సినిమా కోసం తాను అడ్వాన్స్‌గా తీసుకున్న పారితోషికాన్ని రూ.11 కోట్లను తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నారు. నిర్మాత శ్రేయస్సు కోరుతూ పవన్ తీసుకున్న నిర్ణయాన్ని సినీ వర్గాలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పార్లమెంటులో కీలక బిల్లు.. పీఎం, సీఎం ఎవరైనా.. 30 రోజులు జైలులో గడిపితే.. గోవిందా?

HUDCO: అమరావతిలో ప్రపంచ స్థాయి కన్వెన్షన్ సెంటర్‌.. హడ్కో ఏర్పాటు

Pawan Kalyan: పదివేల మంది మహిళలకు వరలక్ష్మీ వ్రతం గిఫ్టులు ఇవ్వనున్న పవన్

UP: ఎందుకొచ్చిన గొడవ.. ప్రియుడితో భార్యకు పెళ్లి చేయించిన భర్త.. ఎక్కడో తెలుసా? (video)

Rajesh Sakariya: ఢిల్లీ ముఖ్యమంత్రిపై దాడి.. నిందితుడిపై దశాబ్ధాల పాటు కేసులున్నాయిగా!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments