Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు శుభవార్త : న్యూ ఇయర్‌కు "వకీల్ సాబ్" టీజర్!

Webdunia
సోమవారం, 28 డిశెంబరు 2020 (14:17 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ ఇది నిజంగానే ఓ శుభవార్తే. కొత్త సంవత్సరం రోజున రెండు పండుగలు రానున్నాయి. అందులో ఒకటి న్యూ ఇయర్ కాగా, మరొకటి తమ అభిమాన నటుడు నటిస్తున్న తాజా చిత్రం "వకీల్ సాబ్" టీజర్ రిలీజ్ కానుంది. 
 
బాలీవుడ్ చిత్రం "పింక్"‌కు ఈ చిత్రం రీమేక్. వేణూ శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, బోనీ కపూర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తుంటే, అంజలి, నివేదా థామస్, అనన్యలు కీలక పాత్రలను పోషిస్తున్నారు. థమన్ సంగీత బాణీలు సమకూర్చుతున్నారు. 
 
నిజానికి లాక్డౌన్‌ కారణంగా ఎప్పుడో రావాల్సిన "వకీల్ సాబ్" సినిమా ఇప్పటివరకూ విడుదలకు నోచుకోలేదు. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. లాక్డౌన్‌కు ముందే 80 శాతం పూర్తయిన 'వకీల్ సాబ్', ప్రస్తుతం మిగిలిన భాగం కూడా దాదాపు పూర్తి చేసినట్టు సమాచారం. 
 
ఇదిలావుంటే, తాజాగా పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక శుభవార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 'వకీల్ సాబ్' సినిమా టీజర్‌ను కొత్త సంవత్సరం కానుకగా విడుదల చేయనున్నారట. వాస్తవానికి గత దసరా పండుగకే ఈ చిత్రం టీజర్ విడుదల చేస్తామని దర్శక నిర్మాతలు ప్రకటించారు. 
 
అయితే, కరోనా మహమ్మారి కారణంగా ఇది సాధ్యపడలేదు. ఇపుడు పరిస్థితులు కాస్త చక్కబడటంతో ఈ టీజర్ విడుదల చేయాలని చూస్తున్నారు. దీంతో న్యూయర్ రోజు పవన్ ఫ్యాన్స్‌కు రెండు పండుగలు కలిసొచ్చినంత ఆనందంగా ఉన్నట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహారాష్ట్రలో మహాయుతి భారీ విజయం వెనుక 5 కీలక కారణాలు, ఏంటవి?

కంట్లో నలక పడిందని వెళితే కాటికి పంపిన ఆసుపత్రి

జార్ఖండ్‌లో 24 ఏళ్ల సంప్రదాయానికి బ్రేక్.. మళ్లీ సీఎంగా హేమంత్ సోరేన్

నేషనల్ మీడియాలో పవన్ ప్రస్తావన: 70 శాతం పట్టున్న కాంగ్రెస్ స్థానాలను NDA ఖాతాలో వేసాడంటూ...

మహారాష్ట్ర సీఎం ఎవరు? మోదీ, అమిత్ షాల ఓటు ఎవరికి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments