Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ జ్ఞాపకాలు మళ్లీ గుర్తుకొస్తున్నాయంటున్న రేణూ దేశాయ్

రేణూ దేశాయ్. సినీ నటి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య. ప్రస్తుతం ఈమె తన బిడ్డలతో ఒంటరిగా జీవిస్తోంది. అయితే, ఈమెకు పాత జ్ఞాపకాలు మళ్లీ గుర్తుకొచ్చాయని అంటోంది. ఇందుకు సంబంధించి 'డాలర్- ఏ ఫిగర్ ఆ

Webdunia
శుక్రవారం, 23 ఫిబ్రవరి 2018 (10:31 IST)
రేణూ దేశాయ్. సినీ నటి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య. ప్రస్తుతం ఈమె తన బిడ్డలతో ఒంటరిగా జీవిస్తోంది. అయితే, ఈమెకు పాత జ్ఞాపకాలు మళ్లీ గుర్తుకొచ్చాయని అంటోంది. ఇందుకు సంబంధించి  'డాలర్- ఏ ఫిగర్ ఆఫ్ స్పీచ్' అనే టైటిల్‌తో ఉన్న ఈ వీడియోను షేర్ చేసింది. 
 
ఇందులో 'నా జ్ఞాప‌కాల‌న్నింటినీ చూసుకుంటున్నాను. ఆయ‌న మాట‌లు, ప‌దాలు, ఆయ‌న పేరు చెక్కిన క‌లం నా జ్ఞాప‌కాల్లో ఉన్నాయి. కానీ క‌మ్ముకున్న హిమం క‌రిగిపోయి మ‌ళ్లీ ఆ జ్ఞాప‌కాలు క‌ళ్లెదుట నిలిచాయి. విధి ఎంత బ‌లీయమైనది. మ‌న‌సు లోతుల్లో పాతుకుపోయిన జ్ఞాప‌కాలన్నింటినీ మ‌ళ్లీ తట్టిలేపింది. 
 
ఆ జ్ఞాప‌కాల‌ను ఇప్పుడు తిరిగి చూసుకుంటే తుప్పు ప‌ట్టిన క‌లం, దానిపై రాసుకున్న పేరు తుడిచిపెట్టుకుపోయాయి. ముక్క‌లైన హృద‌యం, నేను రాసుకున్న లేఖల కాగిత‌పు ముక్క‌లు క‌న్పించాయి' అంటూ జ్ఞాప‌కాల‌ గురించి ఆమె తెలిపిన విధానం గుండెలను పిండేసింది. ఆమె తెలిపిన ఈ జ్ఞాప‌కాలన్నీ పవన్ గురించే అని నెటిజన్లు ఈ వీడియోపై కామెంట్స్ చేస్తున్నారు.
 
ఒకప్పుడు హీరోయిన్‌గా వెండితెరపై వెలిగిపోవాలనుకున్న ఆమె కోరిక రెండే రెండు సినిమాలతో ముగిసిపోయింది. సహజీవనం, పెళ్లి, పిల్లలు, విడాకులు.. ఇలా అన్ని తన జీవితంలో అతి తొందరగా వచ్చేయడంతో ప్రస్తుతం జ్ఞాప‌కాల‌తో బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments